Tuesday, March 19, 2024
Tuesday, March 19, 2024

కరువు అంచున పాకిస్తాన్‌

50 ఏళ్ల గరిష్ఠానికి ద్రవ్యోల్బణం
అప్పుల ఊబిలో దేశం
ఐఎంఎఫ్‌ బెయిలౌట్‌పైనే ఆశలు

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో ఆహార సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. పూటగడవని దారుణ పరిస్థితులు దాయాది దేశంలో ఉన్నాయి. ఏ ఏడాదికి ఆ ఏడు ద్రవ్యోల్బణం పెరుగుతోంది. 2023, మార్చిలో ఐదేళ్ల గరిష్ఠానికి చేరుకొని 35.37 శాతంగా నమోదైంది. బెయిలౌట్‌ ప్యాకేజి కోసం ఆ దేశం అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌)ని ఆశ్రయించింది. నెలసరి ద్రవ్యోల్బణం రేటు 3.72శాతం మేర ఉన్నట్లు శనివారం విడుదలైన ప్రభుత్వ డేటా చెబుతోంది. గడిచిన ఏడాదికి సంబంధించి సగటు ద్రవ్యోల్బణం రేటు 27.26శాతమని తెలిపింది. ఆర్థిక నిర్వహణ లోపం, రాజకీయ అనిశ్చితి పర్యవసానంగా పాకిస్తాన్‌ తీవ్రమైన ఆర్థిక`ఆహార సంక్షోభంలో కూరుకుపోవడంతో కరవు అంచనకు చేరుకుంటోందన్న ఆందోళన నిపుణుల్లో ఉంది. అంతర్జాతీయ చమురు సంక్షోభం, 2022లో వరదలతో దేశం అల్లాడిపోయింది. ప్రస్తుతం ఉన్న అప్పులను తీర్చేందుకు కొన్ని బిలియన్ల డాలర్ల ఆర్థిక సాయం అవసరం ఏర్పడిరది. మరోవైపు విదేశీ మారక నిల్వలు ఖాళీ అయి రూపాయి క్షీణించింది. దీంతో పాకిస్తాన్‌లోని పేదల బతుకులు దుర్భరమయ్యాయి. రంజాన్‌ మాసం మొదలైనప్పటి నుంచి కనీసం 20 మంది ఆహార పంపిణీ కేంద్రాల వద్ద తొక్కిసలాటల్లో చనిపోయారు. శుక్రవారం కరాచీలోని ఓ స్వచ్చంధ సంస్థ చేపట్టిన ఉచిత రేషన్‌ పంపిణీ కార్యక్రమం విషాదాన్ని మిగిల్చింది. జనం ఎగబడటంతో తొక్కిసలాట జరిగి 12 మంది చనిపోయారు. అనేక మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఎనిమిది మంది మహిళలు ఉన్నారు. కరాచీలోని నౌరస్‌ స్క్వేర్‌ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇలాంటి ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి. పాకిస్తాన్‌లో ఆహారంతో పాటు ఆర్థిక సంక్షోభం ముదురుతోంది. ఇప్పటికే అనేక కర్మాగారాలను మూసివేశారు. దీంతో ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు పూట గడవడం కష్టమైంది. ప్రస్తుతం 20 కిలోల గోధుమ పిండి ధర 3000 పాకిస్తానీ రూపాయలు పలుకుతోంది.పాకిస్తాన్‌ ప్రభుత్వం కూడా ఉచితంగా గోధుమ పిండిని అందిస్తోంది. దీంతో చెదురుమదురు ఘటనలు జరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుతున్న పద్ధతి చూస్తుంటే కరువు కోరల్లో దేశం చిక్కుకుంటుందన్న సంకేతాలు ఇస్తున్నట్లు కరాచీకి చెందిన విశ్లేషకులు షహీదా విజారత్‌ అభిప్రాయపడ్డారు. అయితే ఈ దక్షిణాసియా దేశంలో 220మిలియన్ల మంది ఉన్నారు. దేశం మాత్రం మెడలోతు అప్పులలో చిక్కుకుపోయి కఠిన పన్ను సంస్కరణలను తీచ్చి, దివాలా పరిస్థితిని నివారించేందుకు ఐఎంఎఫ్‌ బెయిలౌట్‌ ప్యాకేజిపై ఆశలు పెట్టుకుంది. నుంచి 6.5 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం లభిస్తే కష్టాల్లో నుంచి గట్టెక్కవచ్చని భావిస్తోంది. అయితే తాజా మార్కెట్‌ ఒడిదుడుకులను బట్టి ద్రవ్యోల్బణం స్థాయి పైపైనే కొనసాగనున్నట్లు విశ్లేషకులు అంచనా వేశారు. డిమాండుకు నిత్యావసరాల సరఫరాకు మధ్య తేడా, ఎక్స్ఛేంజ్‌ రేటు క్షీణత, పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో సవరణలతో పరిస్థితి మరింత జఠిలమైనట్లు వారు అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img