Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

కాప్‌ 15 సదస్సులో జీవవైవిధ్యంపై చర్చ

యునాన్‌ : మానవ సంక్షేమానికి కీలకమైన పర్యావరణ వ్యవస్థలను ప్రపంచం కాపాడలేక పోయిందని ఐక్యరాజ్యసమితి జీవవైవిధ్య చీఫ్‌ విచారం వెలిబుచ్చారు. ప్రపంచం తన కీలక పర్యావరణ వ్యవస్థలను రక్షించలేకపోయిందని ఐక్యరాజ్యసమితి జీవవైవిధ్య చీఫ్‌ ఎలిజబెత్‌ మరుమ మ్రెమా సోమవారం అన్నారు. జీవ వైవిధ్యంపై ఐక్యరాజ్యసమితి కన్వెన్షన్‌ (కాప్‌15) కు సంబంధించిన 15వ సమావేశంలో మొదటి భాగం నైరుతి చైనాలోని యునాన్‌ ప్రావిన్స్‌ రాజధాని కున్మింగ్‌లో సోమవారం ప్రారంభ మైంది. ఈ సమావేశం అక్టోబరు 11 నుంచి 15వరకు జరుగుతుంది. వాతావరణమార్పు, పర్యావరణ పరిరక్షణ ప్రధాన లక్ష్యాలుగా ఈ సమావేశంలో చర్చిస్తారు.. ఈ సమావేశం కోసం 1800 పైగా ప్రతినిధులు అన్‌లైన్‌ ఆఫ్‌లైన్‌లో హాజరయ్యారు. ప్రపంచం 2011 నుండి 2020 వరకు అవసరమైన పురోగతులను సాధించ లేదని మానవ శ్రేయస్సుకి కీలకమైన పర్యావరణ వ్యవస్థలను కాపాడలేకపోయిందని ఆమె పేర్కొ న్నారు. 2011`2020 కాలంలో ప్రపంచ జీవ వైవిధ్య పరిరక్షణ మెరుగుదలకోసం, అంతర్జా తీయ సమాజం 2010లో 20 కార్యాచరణ లక్ష్యాలను నిర్దేశించింది. ఈ లక్ష్యాలు ఏవీ ఇప్పటివరకూ పూర్తిగా నెరవేరలేదని కన్వెన్షన్‌ సెక్రటేరియట్‌ ప్రతినిధి లియు అధికారికంగా వెల్లడిరచారు. వచ్చే ఏడాది జరుగనున్న ఈ సమావేశం రెండవ భాగంపై అంతర్జాతీయ సమాజం గొప్ప ఆశలు పెట్టుకోవడంతో గ్లోబల్‌ బయోడైవర్సిటీ ఫ్రేమ్‌వర్క్‌పై సమీక్షించి తగిన నిర్ణయాలు తీసుకుంటామని లియ తెఇపారు. 1993లో అమలులోకి వచ్చిన జీవవైవిధ్యంపై కన్వెన్షన్‌లో పాల్గొన్న మొదటి దేశాలలో చైనా ఒకటి. ఇప్పటివరకు, కన్వెన్షన్‌లో 196 దేశాలు ఉన్నాయి. అమెరికా ఈ ఒప్పందాన్ని ఆమోదించ లేదు. 2030నాటికి పర్యావరణ వ్యవస్థలను రక్షించడానికి ఈ సమావేశం నిర్దేశిస్తుంది. 2030 కోసం ప్రతిపాదించిన ఫ్రేమ్‌వర్క్‌లో 21 లక్ష్యాలు పొందుపరచింది. ముఖ్యంగా 30శాతం భూములు, మహాసముద్రాల రక్షిణ కోసం ‘30/30’ ప్రణాళికను రూపొందించింది. ప్లాస్టిక్‌ వ్యర్థాల ఉత్పత్తిని నిలిపివేయడం, హానికరమైన పురుగుమందుల వాడకాన్ని తగ్గించడం మరో ప్రధాన లక్ష్యంగా నిర్దేశించింది. ఈ ఒప్పందానికి సంబంధించిన రెండవ రౌండ్‌ 2022 ఏప్రిల్‌, మేలో జరుగుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img