Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కాబూల్‌ విమానాశ్రయంలో కాల్పులు

ఐదుగురి మృతి
కాబూల్‌ : తాలిబన్లు అఫ్గాన్‌ను ఆక్రమించుకోవడంతో వేలాదిమంది ప్రజలు దేశాన్ని విడిచివెళ్లేందుకు పరుగులు తీస్తున్నారు. ప్రజలు భయాందోళనలకు లోనవుతున్నారు.ప్రభుత్వ ఉద్యోగలు, వ్యాపారులు, మంత్రులు, మహిళలు ప్రాణభయంతో చేతికి అందిన సామగ్రిని తీసుకుని దేశం విడిచి వెళ్లేందుకు విమానాశ్రయం చేరుకుంటున్నారు. దీనితో హమీద్‌ కర్జాయ్‌ విమానాశ్రయం కిక్కిరిసిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దేశం నుండి పారిపోయేందుకు వందలాదిమంది ప్రయత్నించగా.. 5గురు మరణించారు. మరణించినవారు కాల్పులవల్ల చని పోయారా.. తొక్కిసలాటలో మరణించారా అనే దానిపై స్పష్టతలేదు. ఒక్కో విమానం వద్ద వందల సంఖ్యలో ప్రజలు గుమిగూడారు.భారీగా ప్రజలు చేరుకోవడంతో విమానాశ్రయ ంలో గందరగోళం నెలకొంది. విమానాశ్రయానికి బాధ్యత వహిస్తున్న అమెరికన్‌ దళాలు ప్రజల రద్దీని అదుపు చేసేందుకు గాలిలో కాల్పులు జరిపినట్లు సమాచారం. సోమ వారం ఉదయం అమెరికా వైమానిక దళానికి చెందిన వివిధ కార్గో విమానాలు కాబూల్‌ విమానాశ్రయంలో నిలిపిఉంచారు. తాజాగా అఫ్గాన్‌ తమ గగనతలాన్ని మూసివేసింది. 129 ప్రయాణీకులతో ఢల్లీికి చేరిన ఎయిర్‌ఇండియా విమానం ఆదివారం రాత్రి ఢల్లీికి చేరింది. కాబూల్‌నుంచి ఢల్లీికి వరుసగా విమానాలునడిపేందుకు ఎయిర్‌ఇండియా సిబ్బంది సిద్ధంగా ఉంది. మరో రెండు విమానాలు అత్యవసరాల నిమిత్త సిద్దంగా ఉంచినట్లు భారత ప్రభుత్వం తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img