Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కార్మికులకు మెరుగైన జీతాలు, పని వాతావరణం

ఇదే మేడే నినాదం – ఘనంగా వేడుకలు– ర్యాలీల్లో పాల్గొన్న వేలాది మంది

సియోల్‌: ఆసియా దేశాల్లో మేడే కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయి. భారీ ప్రదర్శనలు, ర్యాలీలతో ఆయా ప్రాంతాలు ఎర్రసముద్రాన్ని తలపించాయి. కామ్రేడ్ల కవాత్‌లు, వీధి నాటకాలు, ఆటపాటలు అమితంగా ఆకట్టుకున్నాయి. కార్మిక నాయకుల ప్రసంగాలు ఆలోచింపజేశాయి. కార్మికులకు మెరుగైన జీతాలు, పనివాతావరణమే ఈ మేడే నినాదమైంది. కార్మికులకు అనుకూలమైన పని పరిస్థితులు కల్పించడం, కనీస వేతనాలను పెంచడాన్నే వక్తలు ప్రధానంగా డిమాండ్‌ చేశారు. ప్రభుత్వాలు అమలు చేసే కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సంస్కరణల పేరిట కొన్ని కార్మిక సంఘాలను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్మిక వ్యతిరేక విధానాలను మే డే సందర్భంగా తీవ్రంగా ప్రతిఘటించారు. తమ డిమాండ్ల సాధన కోసం పెద్దఎత్తున సమ్మెలకు సిద్ధమవుతామని పాలకులను హెచ్చరించారు. అయితే కోవిడ్‌ వల్ల మేడే కళతప్పింది. ఈ ఏడాది రెట్టింపు ఉత్సాహంగా మేడే కార్యక్రమాలు జరుగగా ప్రపంచవ్యాప్తంగా ర్యాలీలు, ప్రదర్శనలు, సభలు, సమావేశాలలో వేలు`లక్షల సంఖ్యలో కార్మికులు పాల్గొని జయంప్రదం చేశారు. తాము పోరాడి సాధించుకున్న హక్కులను వేడుక చేసుకున్నారు.
దక్షిణ కొరియాలో మేడే ర్యాలీల్లో లక్ష మందికిపైగా పాల్గొన్నారు. కోవిడ్‌ మహమ్మారి విజృంభించిన క్రమంలో 2020 నుంచి ఇంత భారీ స్థాయిలో మేడే కార్యక్రమాలను నిర్వహించలేదు. ఆసియా దేశాలన్నింటినీలోనూ ఇదే తరహా పరిస్థితులు కనిపించాయి. రాజధాని సియోల్‌లో జరిగిన రెండు ప్రధాన ర్యాలీలలో కార్మిక నాయకుల ప్రసంగాలు వినేందుకు 30వేల మందికిపైగా తరలివచ్చారు. తొలుత ఆటపాటలతో ప్రజలను ఉత్తేజ పరిచారు. ఆపై ర్యాలీలు నిర్వహించగా అక్కడి వీధులన్నీ ఎరుపెక్కాయి. ది కొరియన్‌ కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ట్రేడ్‌ యూనియన్‌, దిఫెడరేషన్‌ ఆఫ్‌ కొరియన్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ అధ్యర్యంలో ఈ ర్యాలీలు జరిగాయి. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సియోల్‌ పోలీసులు వేల సంఖ్యలో మోహరించారు. ర్యాలీలు సాగే ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ నేతృత్వ ప్రభుత్వం కార్మిక సంఘాల నిర్వీర్యానికి ప్రయత్నిస్తోంది. ఇందుకోసం పారదర్శకత ఉండాలన్న నెపంతో కార్మిక సంస్కరణలు తీసుకొచ్చింది. కొరియన్‌ కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ట్రేడ్‌ యూనియన్‌ అధికార ప్రతినిధి హాన్‌సాంగ్‌ జిన్‌ మాట్లాడుతూ కార్మికుల డిమాండ్లను పరిష్కరించని పక్షంలో జులైలో పెద్దఎత్తున సమ్మె చేయాలని యోచిస్తున్నామన్నారు.
ఉత్తరకొరియాలో: ఉత్తరకొరియాలోని ప్రధాన పత్రిక రోడుంగ్‌ సినుమ్‌ మేడే సందర్భంగా ప్రత్యేక సంపాదకీయాన్ని ప్రచురించింది. అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌కు పెద్దఎత్తున మద్దతివ్వాలని కార్మికలోకానికి పిలుపునిచ్చింది. ‘మనం నిజ మైన సోషలిస్టు కార్మికులుగా ఉండాలి. నాయకత్వానికి విధేయులుగా ఉండాలి. స్వచ్ఛమైన మనస్సుతో ప్రధాన కార్యదర్శి నాయకత్వాన్ని, ఆలోచనలకు కట్టుబ డాలి’ అని పేర్కొంది. తమ కుటుంబ పాలనకు మరింతగా ప్రజల మద్దతును కూడకట్టుకునేందుకు కిమ్‌ యత్నిస్తున్నారు. మహమ్మారి నేపథ్య కష్టాల నుంచి బయటపడేందుకు స్వీయసమృద్ధిగల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు కృషిచేస్తు న్నారు. అదే సమయంలో అణ్వాయుధ కార్యక్రమంపై అమెరికాకు ఉ.కొరియాకు మధ్య భద్రతా పరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఉత్తర కొరియాలో మానవతా సంక్షోభానికి సూచనలే లేవని బాహ్య నిపుణులు చెబుతున్నారు.
ఇండోనేషియాలో: ఇండోనేషియాలో సోమవారం అంతర్జాతీయ కార్మికుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సౌతీస్ట్‌ ఏషియాలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు చెందిన ప్రధాన నగరాల్లో పెద్దఎత్తున ర్యాలీలు నిర్వహించారు. సంప్రదాయ ప్రకారం రాజధాని జకార్తలో నిర్వహించే మేడే ప్రదర్శనల్లో 50వేల మంది వర్కర్లు పాల్గోనున్నారు. ఈ మేరకు 32 కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం వహించే కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండోనేషియా ట్రేడ్‌ యూనియన్స్‌ తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img