Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

కార్మికోద్యమం మరింత బలోపేతం కావాలి

కమ్యూనిస్టు`వర్కర్స్‌ పార్టీల సంయుక్త ప్రకటన పిలుపు

బూర్జువ వ్యతిరేకోద్యమాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం కార్మికులు నడుంబిగించాలని కమ్యూనిస్టువర్కర్ల పార్టీల సంయుక్త ప్రకటన సూచించింది. సోషలిజం పునరుద్ధరణ సామ్యవాద యుద్ధానికి వ్యతిరేక పోరు తీవ్రరూపం దాల్చిన అవసరాన్ని నొక్కిచెప్పింది. ఉక్రెయిన్‌పై ఏడాదిపైగా యుద్ధం జరుగుతూనే ఉందంటూ ఆవేదన వ్యక్తంచేసింది. సోవియట్‌ యూనియన్‌ పతనం, సోషలిజం పరాజయం క్రమంలో ప్రజలు ఇలాంటి విపత్తుకర పరిస్థితులను ఎదుర్కొవాల్సి వస్తోందని ప్రకటన పేర్కొంది. యూఎస్‌ఎస్‌ఆర్‌ ఉన్నప్పుడు సోవియల్‌ రిపబ్లికన్లుగా ఉక్రెయిన్‌, రష్యా విరాజిల్లాయని, రెండు దేశాల ప్రజలు జీవించారని గుర్తుచేసింది. తొమ్మిదేళ్లుగా అక్కడ రక్తం చిందితూనే ఉందని, ఏడాదికిపైగా మారణహోమం కొనసాగుతోందని పేర్కొంది. ఇలాంటి పరిణామాలకు అమెరికా, నాటో, ఈయూ ప్రణాళికలే దారితీశాయని వెల్లడిరచింది. మార్కెట్ల ఆధిపత్యానికి, ముడిసరుకు, రవాణా నెట్వర్లు, యూరేసియా ప్రాంతంలో భౌగోళిక రాజకీయ మైలస్తంభాలపై నియంత్రణ కోసం కేపటలిస్టు రష్యాతో పోటీ నేపథ్యంలో అమెరికా, నాటో, ఈయూ కుతంత్రాలకు తమ రక్తంతో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తున్న ఉక్రెయిన్‌, రష్యా ప్రజలకు కమ్యూనిస్టు, వర్కర్ల పార్టీలు అండగా నిలుస్తాయని సంఫీుభావాన్ని సంయుక్త ప్రకటన ప్రకటించింది. ఫాసిస్టు చర్యలను, కమ్యూనిజం వ్యతిరేకతను, కమ్యూనిస్టులు, ట్రేడ్‌ యూనియన్లపై ఉక్కుపాదం మోపడాన్ని వ్యతిరేకించామని పేర్కొంది. కమ్యూనిస్టు పార్టీలు ఏడాది పొడవునా తీసుకున్న చర్యలకు సెల్యూట్‌ చేస్తున్నట్లు వెల్లడిరచింది. ప్రజా కార్యక్రమాలు, ర్యాలీలు, ప్రదర్శనల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని తేగలిగినట్లు తెలిపింది. నాటో, అమెరికా సైనిక స్థావరాలు, పోర్టులు, రైల్వే స్టేషన్లు, రహదారులపై నిరసనలు, ప్రదర్శనలతో యుద్ధం కోసం కొత్త ఆయుధాలు పంపడాన్ని తీవ్రంగా నిరసించినట్లు పేర్కొంది.ప్రజా చైతన్య కార్యక్రమాల్లో కలిసిరావాలని భావసారూప్యతగల వర్గాలకు పిలుపునిచ్చింది. కార్మికవర్గం కూడా స్వతంత్ర పథాన్ని ఏర్పాటు చేసుకొని ఉద్యమాలను మరింత బోపేతం చేసుకోవాలని సూచించింది. సోషలిజం పునరుద్ధరణ ద్వారా శాంతిని నెలకొల్పవచ్చని, ప్రజల్లో మైత్రి, పరస్పర సహకారానికి అవకాశం కల్పించవ్చని వెల్లడిరచింది. ఈ ప్రకటన చేసిన పార్టీల్లో పీడీఎస్‌, అల్జీరియా, ఆస్ట్రేలియా లేబర్‌ పార్టీ, అజర్‌బైజన్‌, బంగ్లాదేశ్‌, బెల్జియం, కెనడా, గ్రీస్‌, మాల్టా, మెక్సికో, నార్వే, పలస్తీనా, ఫలిపైన్స్‌, సూడాన్‌, స్వీడెన్‌, స్విస్‌, సిరియా, టర్కీ, ఉక్రెయిన్‌, వెనిజులా, అర్జెంటైనా దేశాలకు చెందిన కమ్యూనిస్టు పార్టీలతో పాటు ఇరాన్‌ తేడే పార్టీ, ఐర్లాండ్‌ వర్కర్స్‌ పార్టీ, కజకస్తాన్‌ సోషలిస్టు మూవ్‌మెంట్‌, నెథర్లాండ్స్‌ న్యూ కమ్యూనిస్టు పార్టీ, అమెరికా కమ్యూనిస్టు వర్కర్స్‌ ప్లాట్‌ఫోరం, ఇటలీ కమ్యూనిస్టు ఫ్రంట్‌, రివల్యూషనరీ పార్టీ కమ్యూనిస్ట్స్‌ (ఫ్రాన్స్‌), జేపీవీ శ్రీలంక, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ది వర్కర్స్‌ ఆఫ్‌ స్పెయిన్‌ ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img