Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కీవ్‌లో యుద్ధ వ్యతిరేక ప్రదర్శన

కీవ్‌: యుద్ధానికి వ్యతిరేకంగా ఐక్యతను ప్రదర్శించేందుకు వేలాది మంది కీవ్‌్‌లో ప్రదర్శన చేప ట్టారు. రష్యాతో ముప్పును ఎదుర్కొంటున్నందున భయపడవద్దని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు పౌరులకు విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్‌ జాతీయ జెండాలు ఊపుతూ, జాతీయ గీతాన్ని ఆలపిస్తూ, వేలాది మంది దేశ పౌరులు శీతాకాలపు చలిని తట్టుకుని రాజధాని కీవ్‌లో ప్రద ర్శన చేశారు. భయాందోళనలు పనికిరావు. మనం ఏకం కావాలి, స్వాతంత్య్రం కోసం పోరాడాలి,’ అని విద్యార్థి షెర్‌బెంకో శనివారం అన్నారు, అధ్యక్షుడు వోలోడిమిర్‌ జెలెన్స్‌కీ అంతకుముందు రోజు చెప్నిన అంశాలను గుర్తు చేశారు. ‘యుద్ధం సమాధానం కాదు’ అని రాసి ఉన్న ప్లకార్డులను చేపట్టారు. మరికొందరు ‘ప్రతిఘటించండి’ అన్న బ్యానర్‌లు పట్టుకున్నారు. ‘ఏ రోజు’ అయినా యుద్ధం చెలరేగవచ్చని వాషింగ్టన్‌ హెచ్చరికలతో పొరుగు దేశాలు తమ దౌత్యవేత్తలను ఉక్రెయిన్‌ నుండి తక్షణమే బయటకు రావాలని పౌరులను ఆదేశించాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img