Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కూలిన హెలికాప్టర్‌.. 8 మంది దుర్మరణం

రష్యాలోని కమ్చట్కా ద్వీపంలో ఘటన

మాస్కో : రష్యాలోని కమ్చట్కా ద్వీపంలో పర్యాటకుల ఎంఐ-8 హెలి కాప్టర్‌ కుప్పకూలింది. ఎనిమిది మంది దుర్మరణం చెందిన ఘటన గురు వారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. అగ్ని పర్వతాన్ని సందర్శిం చేందుకు వెళుతుండగా తూర్పు ప్రాంతంలోని కమ్చట్కా ద్వీపంలో క్రొనొటస్కే నేచుర్‌ రిజర్వ్‌ కురిల్‌ సరస్సు వద్ద హెలికాప్టర్‌ కూలిపోయింది. ఆ సమయంలో 13 మంది పర్యాటకులు, ముగ్గురు క్రూతో కలిపి 16 మంది అందులో ప్రయాణించినట్లు తెలిసింది. అగ్నిపర్వతాన్ని సందర్శించేం దుకు వెళుతుండగా గాయపడిన ఎనిమిది మందిని సహాయక సిబ్బంది కాపాడారు. ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలానికి 40మందితో కూడిన రెస్క్యూ బృందాలు, గజ ఈతగాళ్లను పంపినట్లు అధికారులు తెలిపారు. తొమ్మిదిని రక్షించారని ఆరోగ్య శాఖ తెలి పింది. కుర్లి సరస్సులోని 100 మీటర్ల లోతులో హెలికాప్టర్‌ ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. ఈ ఘటనపై విచారణకు రష్యన్‌ ఇన్వెస్టి గేషన్‌ కమిటీ ఆదేశించింది. పర్యాటకుల్లోని చాలామంది మాస్కో, సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ ప్రాంతాలకు చెందినవారేనని తెలుస్తోంది. మంచు కురవడంతో ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ప్రమాదానికి గురయిన హెలికాప్టర్‌ విత్‌యాజ్‌ ఏరో సంస్థకు చెందింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img