Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కెనడా ప్రధానిపై రాళ్ల దాడి

ఒట్టావా : ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రుడీవ్‌పై రాళ్లదాడి జరిగింది. కెనడాలోని ఒంటారియాలో ప్రచారసభలో పాల్గొన్న ప్రధానిపై నిరసన వ్యక్తం చేస్తూ కొందరు రాళ్లు విసిరారు. సిబ్బంది అప్రమత్తం కావడంలో ప్రధానికి ఎటువంటి గాయాలు కాలేదు. అయితే ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడిరది. కెనడాలో వాక్సినేషన్‌పై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వం మాత్రం వాక్సినేషన్‌ను తప్పనసరి చేసింది. దీనిపై ఆందోళనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడోవ్‌ ఒంటారియోలో ఎన్నికల సభకు పాల్గొనేందుకు వెళ్లారు. దీంతో వాక్సిన్‌ వ్యతిరేకులు ప్రధాని కాన్వాయ్‌ను చుట్టుముట్టారు. చిన్న చిన్న రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ప్రధాని సురక్షితంగా బయటపడగా భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఈ దాడిపై ప్రధాని ట్రుడో స్పందిస్తూ.. ‘నా భుజంపై కొన్ని చిన్న రాళ్లు తగిలాయి. అయితే ఈ దాడితో నేను బెదరడం లేదు’ అని స్పష్టం చేశారు. ఈ దాడిపై ప్రతిపక్ష నాయకులు కూడా స్పందించి ప్రధానిపై దాడిని ఖండిరచారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలందరూ వాక్సిన్‌ కచ్చితంగా వేసుకోవాలని ప్రధాని ట్రూడీవ్‌ ఆంక్షలు విధించారు. దానికి సంబంధించిన సర్టిఫికెట్‌ కూడా తప్పనిసరి చేశారు. అయితే దీనికి కొందరు ‘యాంటీ వాక్సిన్‌’ ఉద్యమం లేవనెత్తారు. ఆందోళనకారులు వాక్సినేషన్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు. అయితే ఎన్నికల ముందు ఈ ఘటన జరగడం కలకలం రేపింది. సెప్టెంబర్‌ 20వ తేదీన కెనడాలో ఎన్నికలు జరగనున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img