Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కేకేఈ ప్రచార వీడియో విడుదల

గ్రీస్‌: గ్రీస్‌లో పార్లమెంటరీ ఎన్నికలు మే 21వ తేదీన జరగనున్నాయి. దీంతో దేశంలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఇదే క్రమంలో గ్రీస్‌ కమ్యూనిస్టు పార్టీ (కేకేఈ) కూడా పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ప్రజల్లో చైనత్యం తెచ్చేందుకు, యువ ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్నికలకు ముందు ఓ వీడియోను విడుదల చేసింది. తాము చేసిన పనిని తెలియజేసే విధంగా రెండు నిమిషాల నిడివిగల ప్రచార వీడియోను రూపొందించింది. తమ భావాలను అందులో వ్యక్తం చేసింది. కార్మికశ్రామిక పోరాటాలు, ఉద్యమాలు, నాటో, సామ్యవాదం వ్యతిరేక పోరు, కేకేసీ, కేఎన్‌ఈ సభ్యుల విచారణకు నిరసనగా ఆందోళనలు, ఫాసిస్టు వ్యతిరేక ప్రదర్శనలు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అందించిన తోడ్పాటు, పాలిటెక్నిక్‌ విద్యార్థుల కోసం అమెరికా దౌత్యకార్యాలయం వద్ద కేకేఈ, కేఎన్‌ఈ అధ్వర్యంలో భారీ ప్రదర్శన, కేఎన్‌ఈ ‘ఒడిగిటిస్‌ ఉత్సవం’, వలసదారులుశరణార్థులకు సంఫీుభావం, టర్కీ కమ్యూనిస్టులతో కలిసి కేఎన్‌ఈ సంయుక్త కార్యాచరణ, గతేడాది విశ్వవిద్యాలయ విద్యార్థి ఎన్నికల్లో కేఎన్‌ఈ ఘనవిజయం, ఇటీవల రైలు దుర్ఘటన సమయంలో ప్రజాందోళనలు, ప్రదర్శనలు నిర్వహించడం వంటివన్నీ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో కోసం సంగీతం అందించిన మ్యూజిక్‌ బ్యాండ్‌ ‘కోయినోయి థ్నిటోయి’కు కేఎన్‌ఈ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img