Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

క్యూబాకు హ్యాట్సాఫ్‌..

ప్రపంచ కార్మిక సంఘాల సంఫీుభావం

హవానా : క్యూబాకు వ్యతిరేకంగా ఇటీవల సామ్రాజ్యవాద దేశాల రెచ్చగొట్టే విధానాలను వరల్డ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ (డబ్ల్యుఎఫ్‌టీయూ) తీవ్రంగా ఖండిరచింది. ప్రపంచంలోని 133 దేశాల్లో 105 మిలియన్ల కార్మికులు క్యూబా ప్రజలకు, కార్మికులకు పూర్తిస్థాయి సంఫీుభావాన్ని ప్రకటించాయి. క్యూబాను అస్థిరపరచే అమెరికా రెచ్చగొట్టే చర్యలను, వ్యాఖ్యలను సహించేదిలేదని స్పష్టం చేసింది. 60 సంవత్సరాలుగా క్యూబా ఆర్థిక వ్యవస్థకు, ప్రజలకు తీవ్రమైన సమస్యలను సృష్టిస్తున్న అమెరికా దౌర్జన్యాన్ని, ఆంక్షలను ఎత్తివేయాలని పిలుపునిచ్చాయి. సామ్రాజ్యవాదుల జోక్యం లేకుండా స్వేచ్ఛగా, ప్రజాస్వామ్యబద్ధంగా తమ భవిష్యత్తు గురించి తమకుతాము నిర్ణయించుకునే క్యూబన్‌ ప్రజల హక్కులకు మేము మద్దతు ప్రకటిస్తున్నాం. క్యూబా కార్మికులకు మేం వందనం చేస్తున్నామని ప్రకటించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రజల అవసరాలను సరుకుగా పరిగణించి, మనిషిని మనిషి దోపిడీ చేయడానికి వ్యతిరేకంగా డబ్ల్యుఎఫ్‌టీయూ గళమెత్తింది. క్యూబన్‌ వ్యతిరేకతను తిప్పికొట్టడానికి మేము వారిపక్షాన ఉన్నామని సెంట్రల్‌ డి ట్రాబాజాడోర్స్‌ డి క్యూబా (సీటీసీ)కు హామీ ప్రకటించారు.
గ్రీస్‌కు చెందిన ఆల్‌`వర్కర్స్‌ మిలిటెంట్‌ ఫ్రంట్‌ (పీఏఎమ్‌ఈ) ప్రకటన
క్యూబాకు వ్యతిరేకంగా సామ్రాజ్యవాద శక్తులు, వారి కిరాయి సైనికుల యత్నాలను గ్రీస్‌కు చెందిన పీఏఎమ్‌ఈ ఖండిరచింది. ట్రంప్‌ విధించిన ఆంక్షలను బైడెన్‌ కొనసాగించడాన్ని నిరసించింది. కరోనా వైరస్‌ నియంత్రణకు క్యూబా ఐదు రకాల టీకాలను అభివృద్ధి చేసింది. ప్రపంచంలోని అనేక దేశాలకు తమ వైద్యులను పంపి వైద్య సహాయం చేసింది. ఆరోగ్య సంరక్షణ, విద్య, సాంస్కృతిక రంగాల్లో అంతర్జాతీయ మానవతా సహకారాన్ని అందించినందుకు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది కార్మికులు క్యూబా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. క్యూబా విప్లవాన్ని అణగదొక్కే సామ్రాజ్యవాద శక్తుల ప్రయత్నాలకు వ్యతిరేకంగా కార్మికులు క్యూబా ప్రజలకు సంఫీుభావాన్ని ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img