Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

క్యూబాలో ఐఎంసీడబ్ల్యూపీ సమావేశాలు ప్రారంభం

హవానా : క్యూబా రాజధాని హవానాలో ఈ నెల 27 నుండి 29 వరకు జరుగుతున్న కమ్యూనిస్టు, వర్కర్స్‌ పార్టీల 22వ అంతర్జాతీయ సమావేశం (ఐఎంసీడబ్ల్యూపీ) అట్టహాసంగా ప్రారంభమైంది. 65దేశాల నుండి ప్రతినిధులు సమావేశంలో పాల్గొంటున్నారు. ‘ఐక్యంగా ఉంటే మనం బలవంతులం’’ సమావేశం నినాదం. 82 రాజకీయ శక్తులు, అధ్యక్షులు లేదా ప్రధాన కార్యదర్శుల నేతృత్వంలో 31 ప్రతినిధి వర్గాలు ఈ సమావేశంలో పాల్గొంటున్నాయి. 22వ ఐఎంసీడబ్ల్యూపీ ఇతివృత్తం శీర్షిక : ‘‘క్యూబా, పోరాడుతున్న ప్రజలందరికీ సంఫీుభావం. సామాజిక, ప్రజా ఉద్యమాలతో కలిసి సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో ఐక్యంగా ఉంటే మనం బలవంతులం. సామ్రాజ్యవాదం, దాని విధానాల రూపంలో ఫాసిజం, యుద్ధం ముప్పు. శాంతి, పర్యావరణం, కార్మిక హక్కులు, సంఫీుభావం, సోషలిజం రక్షణలో’’. 1998లో గ్రీస్‌ కమ్యూనిస్టు పార్టీ (కేకేఈ) చొరవతో స్థాపించబడిన ఐఎంసీడబ్ల్యూపీ నేడు ఉన్న వాటిలో అత్యంత సమగ్రమైన, కమ్యూనిస్టు పార్టీల అతి పురాతన సంస్థ. ఈ ఏడాది ఐఎంసీడబ్ల్యూపీ లాటిన్‌ అమెరికా దేశాలలో జరుగుతున్న మూడవది. గత రెండు సమావేశాలు బ్రెజిల్‌ (2008), ఈక్వెడార్‌ (2016)లలో జరిగాయి. ఈ సమావేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ కార్యదర్శి కె.నారాయణ పాల్గొంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img