Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

క్యూబా ప్రఖ్యాత జర్నలిస్టు రోజాస్‌ మృతి

హవానా : క్యూబా జర్నలిస్టు, రచయిత మార్తా రోజాస్‌ (90) సోమవారం మరణించారు. ఇప్పటికీ ఆమె తన వృత్తిని కొనసాగిస్తున్నట్టు క్యూబా పెరియోడిస్టా వెబ్‌సైట్‌ వెల్లడిరచింది. క్యూబా కమ్యూనిస్టు పార్టీ అధికారిక వార్తాపత్రిక గ్రాన్మాలో ఆమె పనిచేస్తోంది. మార్తా రోజాస్‌కు 1997లో నేషనల్‌ జర్నలిజం బహుమతి లభించింది. 2006లో అలెజో కార్పెంటియర్‌ నవలకు బహుమతిని కూడా గెలుచుకుంది. రోజాస్‌ గ్రాన్మా దినపత్రిక వ్యవస్థాపకురాలు. పత్రిక చీఫ్‌ ఎడిటర్‌గా పనిచేశారు. గ్రాన్మా సాంస్కతిక పేపరుకు ఆమె నిర్వహించేవారు. రోజాస్‌ 1965, 1975 నుండి దక్షిణ వియత్నాం, కంబోడియాలో యుద్ధానికి కరస్పాండెంట్‌గా పనిచేశారు. అలా చేసిన మొదటి క్యూబన్‌, లాటిన్‌ అమెరికన్‌ జర్నలిస్టు. ఎల్‌ కొలంపియో డి రే స్పెన్సర్‌, శాంటా లుజురియా, ఎల్‌ హాన్‌ డి ఒవిడో, ఇంగ్లీషు ఫర్‌ ఒన్‌ ఇయర్‌ అనే రచనలు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img