Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

క్రొయేషియాలో బస్సు బోల్తా

10 మంది మృతి : 45 మందికి గాయాలు

జాగ్రేబ్‌ : క్రొయేషియాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు దొర్లిపోయింది. ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో 45 మంది గాయపడ్డారు. ఉదయం 6 గంటలకు రాజధాని జాగ్రేబ్‌కు స్లోవోన్క్సి బ్రోడ్‌ పట్టణానికి మధ్య ఉన్న రహదారిపై బస్సు ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు. ఈ బస్సు జర్మనీ నుంచి కోసోవో రాజధాని ప్రిస్టినాకు వెళుతోందని, ప్రమాదానికి గల కారణాలు తెలియలేదని అన్నారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సు 60 మంది ప్రయాణికులతో నిండుగా ఉన్నట్లు పోలీసు చీఫ్‌ ఫ్రాంజో గాలిక్‌ చెప్పారు. ఇంతటి ఘోర ప్రమాదాన్ని ఎన్నడూ చూడలేదన్నారు. 45 మంది క్షతగాత్రులను స్లోవోన్క్సి బ్రోడ్‌ ఆసుపత్రికి తరలించగా వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడిరచారు.
ప్రధాని, అధ్యక్షుడి దిగ్భ్రాంతి
క్రోయేషియా ప్రధాని అండ్రెజ్‌ ప్లెకోవిక్‌, అధ్యక్షుడు వోసా ఒసామియా ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ మాధ్యమాల ద్వారా బస్సు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపాన్ని, వారి కుటుంబాలకు సానుభూతిని ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. క్రోయేషియా ప్రభుత్వ అధికారులు ఘటనాస్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img