Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

క్వెట్టాలో భారీ పేలుడు… అనేకమందికి గాయాలు


ఇస్లామాబాద్‌: వరుస పేలుళ్లతో పాకిస్థాన్‌ ఉలిక్కిపడిరది. బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లోని క్వెట్టా నగరంలో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. కట్టుదిట్టమైన భద్రతగల ప్రాంతంలో బాంబు పేలినట్లు పాకిస్తాన్‌ మీడియా పేర్కొంది. ప్రాణ నష్టం వివరాలు తెలియకపోగా అనేకమంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపింది. క్వెట్టా పోలీస్‌ ప్రధాన కార్యాలయం సమీపంలోని క్వెట్టా కంటోన్మెంట్‌ ప్రవేశం (ఎఫ్‌సీ మూసా చెక్‌పాయింట్‌) వద్ద ఉదయం పేలుడు జరుగగా దీనికి సంబంధించిన వీడియోను ‘బలూచిస్థాన్‌ పోస్ట్‌’ ట్వీట్‌ చేసింది. పెద్ద ఎత్తున పొగ, ధూళి వ్యాపించినట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, సహాయ కార్యకలాపాలు చేపట్టారు. పీఎస్‌ఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ నేపథ్యంలో ఈ నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. గాయపడిన వారిలో కొందరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని, క్షతగాత్రులను క్వెట్టాలోని సివిల్‌ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు చెప్పారు. పోలీసులు, అత్యవసర బృందాలు సహాయక చర్యలు చేపట్టినట్లు మీడియా తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img