Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

గర్భస్రావ చట్టానికి వ్యతిరేకంగా నిరసన

టెక్సాస్‌: గర్భస్రావంపై ఆంక్షలను విధించడాన్ని నిరసిస్తూ అమెరికా దేశవ్యాప్తంగా వేలాది మహిళలు నిరసించారు. చట్టప్రకారం తమకు దక్కవలసిన హక్కులను కొనసాగించాలని ప్లకార్డులతో నినదించారు. దీంతో 50 రాష్ట్రల్లో మహిళల నిరసనలు చేపట్టారు. గత నెలలో టెక్సాస్‌ రాజధాని ఆస్టిన్‌లో గవర్నర్‌ గ్రెగ్‌ అబాట్‌ సంతకం చేసిన ‘హార్ట్‌ బీట్‌’ చట్టాన్ని వందలాది మంది వ్యతిరేకిస్తున్నారు. అమల్లోకొచ్చిన ఈ చట్టం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. టెక్సాస్‌ కొత్త చట్టం ప్రకారం.. గర్భస్థ పిండం గుండె కొట్టుకోవడం ప్రారంభమైతే అబార్షన్‌ చేయించుకోవడం నిషేదం. సాధారణంగా గర్భంలో 6 వారాలకు పిండం గుండె కొట్టుకోవడం ప్రారంభమవుతుంది (చాలా మంది మహిళలు తాము గర్భవతులని తెలియక ముందే 85 నుంచి 95 శాతం ముందుగానే అబార్షన్లు అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు). అత్యచార బాధితులు, అక్రమ సంబంధం ద్వారా గర్భవతులైన వారికి కూడా ఈ చట్టం నుంచి ఎటువంటి మినహాయింపు లేదు. ఈ నిషేధాన్ని అతిక్రమించి అబార్షన్‌కు పాల్పడినట్లు రుజువుచేసిన వారికి అక్కడి ప్రభుత్వం పది వేల డాలర్లు రివార్డు కూడా ప్రకటించింది. ఇది అత్యంత నిర్భందమైనదని, ఈ చట్టాన్ని రద్దు చేయాలంటూ అక్కడి మహిళలు ఆందోళనలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img