Friday, April 26, 2024
Friday, April 26, 2024

గెరిల్లా పోరాటయోధుడు, తత్వవేత్త గుజ్మన్‌ మృతి

లిమా : పెరూ పోరాట యోధుడు, తత్వవేత్త, ప్రొఫెసర్‌ అభిమాయేల్‌ గుజ్మాన్‌ (86) మృతి చెందారు. ‘కామ్రేడ్‌ గొంజలో’ అని పిలువబడే గుజ్మన్‌ జైలులో 29 సంవత్సరాలుగా కారాగార శిక్ష అనుభవిస్తూ ఆరోగ్యం క్షీణించడంతో మరణించారు. గుజ్మన్‌ పెరూలోని సెంట్రల్‌ ఆండియన్‌ ప్రాంతంలోని అయకుచోలోని శాన్‌ క్రిస్టోబల్‌ డి హువామాంగా నేషనల్‌ యూనివర్సిటీలో ఫిలాసఫీ ప్రొఫెసర్‌, మార్క్సిస్టు తత్వవేత్త కూడా..చైనా పర్యటనలో గుజ్మన్‌ కమ్యూనిస్టు నాయకుడు మావో జెడాంగ్‌ ప్రేరణ పొందారు. 1992 నుండి దేశంలో తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేశారు. ఈ క్రమంలోనే పెరూ ప్రభుత్వం గుజ్మాన్‌పై రాజద్రోహం కేసు మోపి ఖైదు చేసింది. పెరూలో నెలకొన్న బూర్జువా నాయకత్వానికి వ్యతిరేకంగా 1969లో గుజ్మాన్‌ 11 మంది సభ్యులతో షైనింగ్‌ పాత్‌ అనే గెరిల్లా గ్రూపుకు నాయకత్వం వహించారు. 1980వ దశకం నాటికి షైనింగ్‌ పాత్‌ పెరూవియన్‌ ప్రభుత్వ నిరంకుశ విధానాలక వ్యతిరేకంగా సాయుధ గెరిల్లా పోరాటాలను ప్రారంభించింది. ఈ క్రమంలోనే గుజ్మాన్‌ గ్రూపు పెరూలోని బూర్జువా పాలనకు వ్యతిరేకంగా చేపట్టిన సాయుధ పోరాటంలో ప్రభుత్వం అమాయక ప్రజలను, ట్రేడ్‌యూనియన్‌ సభ్యులతోపాటు సుమారు 70వేల మందిని హతమార్చింది. ఈ తిరుగుబాటు సెప్టెంబరు 1992లో ముగిసింది. పెరూ ఇంటెలిజెన్స్‌ గుజ్వాన్‌ను లిమాలో అదుపులోకి తీసుకుంది. దీనికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా మానవహక్కుల సంస్థలు వివిధ వర్గాల గ్రూపులు గుజ్మాన్‌ను సంఫీుభావం పలికారు. గుజ్మాన్‌కు విధించిన జైలుశిక్షను ఖండిరచారు. 2004లో పెరు ప్రభుత్వం గుజ్మాన్‌ మరొక కేసు ఆపాదించింది. అక్టోబరు 2006లో కోర్టు నిర్ణయంమేరకు ఆయనను తీవ్రవాదం, హత్యాయత్నం కేసు మోపి దోషిగా నిర్థారించి జీవితఖైదు శిక్ష విధించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img