Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

గ్రీసులో సామ్రాజ్యవాద వ్యతిరేక ర్యాలీలు

ఏథెన్స్‌ : 1973 పాలిటెక్నిక్‌ తిరుగుబాటు 48వ వార్షికోత్స వాన్ని పురస్కరించుకుని కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ గ్రీస్‌ (కెకెఈ) దాని యువజన విభాగం (కెఎన్‌ఇ) బుధవారం గ్రీస్‌ రాజధాని ఏథెన్స్‌, థెస్సలోనికీతోపాటు ఇతర ప్రధాన నగరాల్లో భారీ ర్యాలీలు చేపట్టింది. ఈ ర్యాలీలో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. నిరసనకారులు గ్రీకు రాజధాని వీధుల్లో శాంతియుతంగా ప్రదర్శన చేశారు, సామ్రాజ్యవాద విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెట్టుబడిదారీ విధానాలు నియంత్రించాలని డిమాండ్‌ చేశారు. గ్రీస్‌ రాయబార కార్యాలయంలో అమెరికా జెండాలను కాల్చారు. ఈ ర్యాలీకి అధిపతిగా గ్రీక్‌ జుంటాచే ఖైదు చేయబడిన, బహిష్కరింపబడిన అసోసియేషన్‌ సభ్యులు ఉన్నారు. ఈ ర్యాలీలో పీస్‌ కమిటీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డిటెంటె అండ్‌ పీస్‌, ఫెడరేషన్‌ ఆఫ్‌ గ్రీక్‌ ఉమెన్‌,ఆల్‌-వర్కర్స్‌ మిలిటెంట్‌ ఫ్రంట్‌, ట్రేడ్‌ యూనియన్‌లు, అనేక విద్యార్థుల సంఘాలు పాల్గొన్నాయి. కేకేఈ జనరల్‌ సెక్రటరీ డిమిత్రిస్‌ కౌట్సౌంబస్‌ ఈ ర్యాలీకి హాజరయ్యారు,

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img