Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

గ్రీస్‌ చివరి రాజు కాన్స్‌టెంటైన్‌2 మృతి

డచ్‌వెల్లే: గ్రీక్‌ దేశ చివరి రాజు కాన్స్‌టెంటైన్‌2 (82) ఏథెన్స్‌లో కన్నుమూశారు. గుండెపోటుకు గురై కాన్స్‌టంటైన్‌2 మరణించినట్లు గ్రీక్‌ మీడియా పేర్కొంది. గ్రీస్‌ ప్రజాతంత్రం కాకముందు అంటే 1974లో ఈయన దేశాన్ని పాలించారు. యువరాజు పాల్‌ (కింగ్‌ జార్జ్‌2 తమ్ముడు), హాన్నోవర్‌ యువరాణి ఫెడరికాకు 1940, జూన్‌ 2న కాన్స్‌టెంటైన్‌ జన్మించారు. కాన్స్‌టెంటైన్‌ మొదటి పుట్టినరోజు కంటే ముందు రెండవ ప్రపంచ యుద్ధం క్రమంలో జర్మీనీ దండయాత్ర నేపథ్యంలో గ్రీస్‌ నుంచి రాజకుటుంబం పారిపోయింది. కింగ్‌ జార్జ్‌2 1946లో గ్రీస్‌కు తిరిగి రాగలిగారు. ఆ తర్వాత కొన్ని నెలలకు ఆయన మరణించారు. కాన్స్‌టెంటైన్‌ను కింగ్‌ పాల్‌1కు వారసుడయ్యారు. కింగ్‌ పాల్‌1 క్యాన్సర్‌ బారిన పడి 1964 మార్చి 6న మరణించారు. దీంతో రాజభారం కాన్స్‌టెంటైన్‌ భుజాలపైకొచ్చింది. అప్పట్లో సేయింలింగ్‌లో ఒలింపిక్స్‌లో స్వర్ణపతాకం సాధించి ప్రాచుర్యం పొందిన కాన్స్‌టెంటైన్‌కు ప్రజాదరణ కూడా ఉండటంతో రాజకీయ వ్యవహారాల్లో ఆయన చురుకుగా ఉండేవారు. 1967లో సైనిక తిరుగుబాటు జరుగగా దానిని తిప్పికొట్టలేని కారణంగా ఆయనకు అజ్ఞాతవాసం తప్పలేదు. ఆపై ఏడాదికి ప్రజాభిప్రాయ సేకరణ జరిగినప్పటికీ ఆయన తిరిగి అధికార పీఠాన్ని అధీష్టించే అవకాశాలు లేకుండాపోయాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img