Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

గ్రీస్‌ యూనివర్సిటీ విద్యార్థి ఎన్నికల్లో మళ్లీ గెలిచిన పాన్స్‌పౌండస్టికి కేఎస్‌

ఏథెన్స్‌: కమ్యూనిస్టులు మద్దతిచ్చిన ‘పాన్స్‌పౌండస్టికి కేఎస్‌’ (ఆల్‌ స్టూడెంట్‌ కోఆపరేటివ్‌ మూవ్‌మెంట్‌) విజయపరంపర కొనసాగింది. దేశంలోని అన్ని యూనివర్సిటీలు, టెక్నాలజికల్‌ ఇనిస్టిట్యూట్‌లలో జరిగిన విద్యార్థి సంఘాల ఎన్నికల్లో మరోసారి విజయాన్ని పాన్స్‌పౌండస్టికి కేఎస్‌’ నమోదు చేసింది. ఈనెల 21న పార్లమెంటరీ ఎన్నికలు జరగనున్న క్రమంలో ‘పాన్స్‌పౌండస్టికి కేఎస్‌’ తాజా గెలుపునకు ప్రాధాన్యత ఏర్పడిరది. విద్య సంస్కరణలను కన్జర్వేటివ్‌ న్యూ డెమొక్రసీ (ఎన్‌డీ) ప్రభుత్వం అమలు చేయనున్న తరుణంలో ఈ గెలుపు చాలా కీలకమైనదిగా పరిణమించింది. 272 విభాగాలకుగాను 255లో ‘పాన్స్‌పౌండస్టికి కేఎస్‌’ గెలిచింది. 35.15శాతం ఓట్లు పొందింది. ప్రభుత్వ అనుకూల డీఏపీకి 26.36శాతం, సామాజిక ప్రజాస్వామిక పీఏఎస్‌పీకి 9.67శాతం, ఈఏఏకే` ఏఆర్‌ఈఎన్‌కు 9.42శాతం, సిరిజా మద్దతున్న డిక్యోకు 2.41శాతం ఓట్లు వచ్చాయి. 2022లోనూ ‘పాన్స్‌పౌండస్టికి కేఎస్‌’కు 34.07శాతం ఓట్లు రాగా డీఏపీకి 27.69శాతం లభించాయి. అయితే బుధవారం రాత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత వందలాది మంది విద్యార్థులు ఏథెన్స్‌ పాటిటెక్నిక్‌ వద్ద సంబరాలు జరుపుకున్నారు. ‘పాన్స్‌పౌండస్టికి కేఎస్‌’ గెలుపు కొత్త ఆశలకు, సానుకూలతకు సందేశమని, తమ హక్కులపై దాడులకు వ్యతిరేకంగా పోరాటాలకు విద్యార్థులు సిద్ధమని పాలక పక్షానికి సంకేతమని గ్రీస్‌ కమ్యూనిస్టు యూత్‌ (కేఎన్‌ఈ) కార్యదర్శి థోడోరిస్‌ కోట్స్‌ంటిస్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img