Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఘనంగా క్యూబా తిరుగుబాటు దినోత్సవం

హవానా : క్యూబా మంగళవారం జాతీయ తిరుగుబాటు దినోత్సవాన్ని అత్యంత ఘనంగా జరుపుకుంది. మోన్‌కాడా, కార్లోస్‌ మాన్యువల్‌ డి సెస్పెడెస్‌ సైనిక బ్యారక్‌లపై దాడులు జరిగిన 69 సంవత్సరాల సందర్బంగా జరిగిన ఈ కార్యక్రమానికి ఆర్మీ జనరల్‌, క్యూబా విప్లవ నాయకుడు రౌల్‌ కాస్ట్రో, అధ్యక్షుడు కానెల్‌, ప్రధాని మాన్యుయెల్‌ మారెరో ఇతర అధికారులు రాజకీయ కార్యక్రమానికి హాజరయ్యారు. దీనికి దాదాపు 10,000 మంది హాజరయ్యారు. జులై 26, 1953 ఆదివారం తెల్లవారుజామున, శాంటియాగో డి క్యూబాలో జరిగిన సైనిక బ్యారెల్స్‌పై జరిగిన దాడుల్లో 131 మంది యువ పోరాట యోధులు, 16 కార్లలో ఆర్మీ యూనిఫారాలు ధరించి, కాస్ట్రో నేతృత్వంలో మోంకడా బ్యారక్స్‌పై దాడి చేశారు. ఈ తిరుగుబాటు కొత్తతరం క్యూబన్‌లను ప్రపంచానికి తెలియజేశాయి. ఈ సందర్భంగా ప్రతి ఏడాది జూలై 26న క్యూబన్లు జాతీయ తిరుగుబాటు దినోత్సవాన్ని జరుపుకుంటారు. అదే రోజు అదే సమయంలో, 28 మంది విప్లవకారులు బయామోలోని కార్లోస్‌ మాన్యువల్‌ డి సెస్పెడెస్‌ బ్యారక్‌పై దాడి చేశారు…ఈ రెండు చర్యల లక్ష్యం బాటిస్టా నియంతృత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని ప్రారంభించడం. ఈ పోరాటం బ్యారక్స్‌ వెలుపల ప్రారంభమైంది. సుదీర్ఘంగా కొనసాగింది, ఇందులో సైనికులు విజయం సాధించారు. ప్రజల సహాయంతో తప్పించుకోగలిగిన కొంతమంది పోరాట యోధులు తప్ప, చాలా మంది తిరుగుబాటుదారులు పట్టుబడ్డారు. వారిలో ఎక్కువ మంది తరువాతి రోజుల్లో చంపబడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img