Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఘనంగా ద.ఆఫ్రికా సీపీ శతవార్షికోత్సవం

కేప్‌టౌన్‌ : ప్రపంచం వివిధ క్లిష్ట సవాళ్లను ఎదుర్కొం టున్న సమయంలో దక్షిణాఫ్రికా కమ్యూనిస్టు పార్టీ చారిత్రా త్మక వ్యవస్థాపక సమావేశాలు జులై 31న ప్రారంభమై ఆగస్టు 2న జయప్రదంగా ముగిశాయి. సవాళ్లను ఎదుర్కోవడంలో పెట్టుబడీదారీ వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందిందని పార్టీ ప్రధాన కార్యదర్శి బ్లేడ్‌ పేర్కొన్నారు. కరోనా వైరస్‌ ప్రభావం మిలియన్ల మంది కార్మికవర్గాల జీవితాలపై పెను ప్రభావం చూపింది. కొవిడ్‌`19 సంక్షోభం, మానవత్వంలేని పెట్టుబడీ దారీ వ్యవస్థవైఫల్యాల వల్ల వచ్చిన విధ్వంసాన్ని కార్మికవర్గం భరించవలసివచ్చిందని అన్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ బ్లేడ్‌ ఎన్‌జిమాండ్‌ ప్రతినిధులతో చర్చించారు. 100 సంవత్సరాల అవిచ్ఛిన్న పోరాటం, సామాజిక పరివర్థన,ఆర్థిక విధాన ఆవశ్యకాలపై ప్రధానంగా దృష్టి సారించారు. కమ్యూనిస్టుపార్టీ ఆఫ్‌ దక్షిణాఫ్రికా (సీపీఎస్‌ఏ) వ్యవస్థాపక సమావేశం కేప్‌టౌన్‌లోని 1921, జులైలో జరిగింది. 2000 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో సమావేశ ప్రతినిధులు అధికారికంగా కమ్యూనిస్టు పార్టీని రూపొందించే తీర్మానాన్ని ఆమోదించారు. కమ్యూనిస్టు పార్టీ దక్షిణాఫ్రికా జాతీయ విముక్తి ఉద్యమంలోనూ, ప్రజస్వామ్యంకోసం పోరాటాన్ని సామాజిక విముక్తి దిశగా ముందుకు తీసుకెళ్లేం దుకు కమ్యూనిస్టు విప్లవకారులు అన్ని రంగాలలో చురుకైన పాత్రపోషించారు. వర్ణవివక్షపాలనను కమ్యూనిస్టు పార్టీ నిషేధించింది. 1950 దశకంలో దక్షిణాఫ్రికాలో కమ్యూనిస్టు కార్యకలాపాలను నిషేధించడంతో కమ్యూనిస్టు పార్టీ పోరా టాన్ని కొనసాగించడానికి, తీవ్రతరం చేయడానికి నూతన పద్ధతులను అవలంబించింది. కమ్యూనిస్టులు 1950వ దశకంలో స్వేచ్ఛ చార్టర్‌ ముసాయిదా, ఆమోదం సాయుధ పోరాటంలో ఉమ్‌ఖోంటో ప్రముఖ పాత్ర పోషించారు. 1960వ దశకంలో ప్రజా పోరాటాలు, 1990 ప్రారంభంలో వర్ణవివక్ష పాలన ఓటమి చారిత్రక ప్రామఖ్యత కలిగిన ఘటనలుగా చెప్పవచ్చు. దక్షిణాఫ్రికా స్వేచ్ఛకోసం అపారమైన త్యాగాలు చేసినవారిలో కమ్యూనిస్టులు ఉన్నారు. ఈ క్రమంలో ప్రముఖ కమ్యూనిస్టులు హత్యకు గురయ్యారు. వర్ణ వివక్షకారణంగా తమ కుటుంబసభ్యులు ఎక్కడున్నారో కూడా తెలియని కుటుంబాలు ఈ నాటికీ ఉన్నాయి. కార్మికవర్గానికి వ్యతిరేకంగా ప్రస్తుతం దాడులు జరుగు తున్నాయి. నయా ఉదారవాద కాఠిన్యం దక్షిణాఫ్రికాలో ఎక్కువవుతోంది. ప్రభు త్వం, ప్రైపేటు రంగాల్లో ఉద్యోగాల కోతలు, వేతనాల తగ్గింపు ప్రహసనంగా మారాయి. ప్రస్తుత కాలంలో సీపీఎస్‌ఏ పాత్ర ముఖ్యమైనది. జాతీయ అణచి వేతలకు వ్యతిరేకంగా కార్మికవర్గ పోరా టాల్లో సీపీఎస్‌ఏ ప్రముఖపాత్ర పోషిస్తోంది. దేశంలో అవినీతి వ్యతిరేక ప్రచారం, ఆకలినిర్మూలన,ఆరోగ్య సంరక్షణతోపాటు కార్మికలు హక్కులను కపాడటం, కార్మిక సంఘాల నిర్మాణా నికి, బలోపేతానికి కార్మిక సంఘాలపై దృష్టి సారించడం పార్టీ ప్రధానకర్తవ్యంగా బ్లేడ్‌పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img