Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

చట్టాలు ఉల్లంఘించిన నెతన్యాహు

రమల్లా: వెస్ట్‌ బ్యాంక్‌ నగరం ఉత్తర ప్రాంతంలోని నబ్లస్‌ సమీపంలోని హర్‌ బ్రఖాలో ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు పర్యటనను పలస్తీనా విదేశాంగ మంత్రిత్వశాఖ తీవ్రంగా ఖండిరచింది. వెస్ట్‌బ్యాంక్‌లో నెతన్యాహు రెచ్చగొట్టే పర్యటన, ప్రకటనలు, వైఖరిని ఖండిస్తున్నట్లు పేర్కొంది. అంతర్జాతీయ చట్టాల నియమాలు, తీర్మానాలు, ఒప్పందాలకు విరుద్ధంగా నెతన్యాహు పర్యటన చట్టబద్దమైందికాదని పేర్కొంది. ఈ పర్యటన ఇజ్రాయిల్‌ ప్రభుత్వం నిజస్వరూపాన్ని వెల్లడిస్తుందని తెలిపింది. ఈ ప్రాంతాల్లో శాంతిప్రక్రియను పునరుద్ధరించే అవకాశాన్ని నెతన్యాహు నాశనం చేస్తున్నట్లు పేర్కొంది. నబ్లస్‌కు దక్షిణంగా ఉన్న హవారా పట్టణంలో తాజాగా రెండు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో మరణించిన కుటుంబాల పరామర్శకు వచ్చినట్లు నెతన్యాహు కార్యాలయం విడుదల చేసిన ప్రకటన తెలిపింది. ఈ దాడుల్లో డజన్ల కొద్దీ కార్లు, గృహాలు ధ్వంసమయ్యాయి. జనవరి 1 నుంచి పలస్తీనియన్లు, ఇజ్రాయిలీల మధ్య తాజాగా నెలకొన్న ఉద్రిక్తతల మధ్య నెతన్యాహు పర్యటన జరిగింది. ఇజ్రాయిల్‌ 1967లో వెస్ట్‌ బ్యాంక్‌ను తన ఆధీనంలోకి తీసుకుంది. అక్కడ డజన్ల కొద్దీ నివాసాలను ఏర్పాటు చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img