Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

చరిత్రకెక్కిన జిన్‌పింగ్‌

. చైనా అధ్యక్షుడిగా మూడోసారి పగ్గాలు
. రాజ్యాంగానికి కట్టుబడతా : నూతన అధ్యక్షుడి ప్రతిజ్ఞ
. ఉపాధ్యక్షుడిగా హాన్‌జెంగ్‌ ఎన్నిక

బీజింగ్‌: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ చరిత్రాత్మకంగా మూడవసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. చైనా కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్‌ తర్వాత పదేళ్లకుపైగా అధికారంలో ఉండగలిగిన నాయకుడిగా నిలిచారు. ఆయన శుక్రవారం పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా (పీఆర్‌సీ) అధ్యక్షుడిగా, పీఆర్‌సీ సెంట్రల్‌ మిలటరీ కమిషన్‌ (సీఎంసీ) చైర్మన్‌గా జిన్‌పింగ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 14వ నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ (ఎన్‌పీసీ) సమావేశాల్లో భాగంగా దేశ అధ్యక్ష, ఉపాధ్యక్షులతో పాటు కొందరు ఉన్నతాధికారుల ఎన్నిక జరిగింది. 2,950 మంది శాసనసభ్యులు ఏకగ్రీవంగా జిన్‌పింగ్‌ను ఎన్నుకున్నట్లు ఎన్‌పీసీ ప్రకటించింది. మూడవసారి అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ప్రకటించిన అనంతరం చైనా రాజ్యాంగానికి నిబద్ధుడినై ఉంటానని, దానికి కట్టుబడి పరిపాలన అందిస్తానని జిన్‌పింగ్‌ ప్రతిజ్ఞ చేశారు. శిరస్సు వంచి సభకు నమస్కరించారు. ఈయన మరో ఐదేళ్లు పదవిలో కొనసాగుతారు. దీంతో ఆయన జీవితాంతం అధ్యక్ష పదవిలోనే ఉంటారన్న అంచనాలు పెరిగాయి. అయితే ఆయన గతేడాది అక్టోబరులో సీపీసీ అధినేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం విదితమే. జిన్‌పింగ్‌కు సన్నిహితుడైన హాన్‌జెంగ్‌ను కొత్త ఉపాధ్యక్షుడిగా ఎన్నకున్నట్లు ఎన్‌పీసీ ప్రకటించింది. మూడవ ప్లీనరీ సమావేశంలో ఉపాధ్యక్షుడి ఎన్నిక జరిగింది. చైనా తొలి ఉప ప్రధాని హాన్‌జెంగ్‌ నూతన ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనట్లు అధికారిక ప్రకటన పేర్కొంది. హాన్‌ చైనా ఉన్నతాధికారి. అంతర్జాతీయ సహకారంఇంధన సహకారంపై రష్యాచైనా కమిషన్‌కు కో`చైర్‌గాÑ హాంగ్‌కాంగ్‌, మకావ్‌ వ్యవహారాల బాధ్యులుగా, వింటర్‌ ఒలింపిక్స్‌ స్టీరింగ్‌ గ్రూపు చైర్మన్‌గా వ్యవహరించారు. ఇదిలావుంటే నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ స్టాండిరగ్‌ కమిటీ చైర్మన్‌గా జావో లెజి, చైనా రాజకీయ సంప్రదింపుల సదస్సు చైర్మన్‌గా వాంగ్‌ హునింగ్‌ కూడా కొత్తగా ఎన్నికయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img