Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

చైనాపై కవ్వింపు చర్యలు అమెరికాకు తగదు: టర్కీ

బీజింగ్‌: తైవాన్‌లో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ పర్యటన చైనా సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను తీవ్రంగా దెబ్బతీస్తుందని, తైవాన్‌లో శాంతి, స్థిరత్వానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని అంతర్జాతీయ విద్యావేత్తలు,విశ్లేషకులు, అధికారులు పేర్కొన్నారు. పెలోసీ పర్యటన అంతర్జాతీయ చట్టాలను, అంతర్జాతీయ సంబంధాలను నియంత్రించే ప్రాథమిక నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించిందని పేర్కొన్నారు. అమెరికా చేపట్టిన ఈ చర్య అంతర్జాతీయ సమాజానికి సమర్థనీయం కాదని స్పష్టం చేశారు. చైనా సార్వభౌమాధి కారం, ప్రాదేశిక సమగ్రత ఉల్లంఘనను ఎట్టి పరిస్థితులోనూ అనుమతించదని పేర్కొన్నారు. ఈ పర్యటనపై క్రెమ్లిన్‌ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్‌ మాట్లాడుతూ, రష్యా చైనాకు సంఫీుభావంగా ఉందని టాస్‌ నివేదించింది. ‘‘మేము చైనా సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవిస్తాము ప్రపంచంలోని ఏ దేశానికీ దానిని ప్రశ్నించే హక్కు ఉండదని’’ అన్నారు. ఇతర దేశాల సార్వభౌమాధికారం పై అమెరికాకు గౌరవం లేదు. దాని స్వంత భౌగోళిక రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తుందని సిరియా విశ్లేషకుడు ఘసన్‌ యూసఫ్‌ అన్నారు. పాకిస్తాన్‌ అంతర్జాతీయ లాఫేర్‌ స్పెషలిస్ట్‌ హసన్‌ అస్లామ్‌ షాద్‌ మాట్లాడుతూ, చైనాకు వ్యతిరేకంగా తైవాన్‌ను వంతెనగా మార్చడానికి అమెరికా యత్నిస్తోందని అన్నారు. పెలోసి తైవాన్‌ పర్యటన ద్వారా ఏర్పడిన సమస్యలకు అమెరికా బాధ్యత వహిస్తుందని అన్నారు. అమెరికాకు వ్యతిరేకంగా టర్కీ మాజీ దౌత్యవేత్త ముస్తఫా నోయన్‌ రోనా మాట్లాడుతూ, చైనాపై కవ్వింపు చర్యలను అమెరికా నిలిపివేయాలని, పెలోసి సందర్శన తైవాన్‌కు ఎటువంటి ప్రయోజనాలను తీసుకురాదని స్పష్టం చేశారు.
ఒకే చైనా సూత్రాన్ని సవాలు చేయడం వ్యర్థం
ఒకే చైనా విధానానికి కట్టుబడి ఉండబోమని అమెరికా పదే పదే ప్రకటించింది, అయితే కొందరు రాజకీయ నాయకులు ఏక చైనా సూత్రాన్ని సవాలు చేసి ఈ రాజకీయ కుతంత్రాలు చేస్తున్నారని ది ఫిలిప్పైన్‌ స్టార్‌ అనే ఆంగ్ల దినపత్రికకు కాలమిస్ట్‌ విల్సన్‌ లీ ఫ్లోర్స్‌ అన్నారు. వన్‌-చైనా సూత్రం అంతర్జాతీయ సమాజం ద్వారా విశ్వవ్యాప్తంగా గుర్తించబడిన ఆనవాయితీ అని, తైవాన్‌ చైనాలో ఒక భాగమని, ఇది కాదనలేని వాస్తవమని, వన్‌-చైనా సూత్రాన్ని అమెరికా పాటించాలని ఆయన అన్నారు. తైవాన్‌లో అమెరికా అధికారుల సందర్శనలు ఒక-చైనా సూత్రాన్ని తీవ్రంగా ఉల్లంఘిస్తాయని, తైవాన్‌ జలసంధి అంతటా శాంతి, స్థిరత్వానికి హాని కలిగిస్తాయని ఇండోనేషియా థింక్‌ ట్యాంక్‌ ఆసియా ఇన్నోవేషన్‌ స్టడీ సెంటర్‌ ఛైర్మన్‌ బాంబాంగ్‌ సూర్యోనో అన్నారు, అమెరికా ఒకే చైనాకు కట్టుబడి ఉండటం గురించి మాట్లాడుతుందని అన్నారు. చైనా అంతర్గత వ్యవహారాల్లో అమెరికా ద్వంద్వ-వ్యవహారాలు, జోక్యాన్ని తీవ్రంగా ఖండిరచాలని పేర్కొన్నారు. పెలోసి తైవాన్‌ పర్యటన చట్టవిరుద్ధమైన, వ్యర్థమైనదిగా పేర్కొన్నారు. యుఎస్‌ పబ్లికేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంటెలిజెన్స్‌ రివ్యూ వాషింగ్టన్‌ బ్యూరో చీఫ్‌ విలియం జోన్స్‌, పెలోసి తైవాన్‌ పర్యటనను ఆమె ‘‘అవివేకపు చర్య’’గా అభివర్ణించారు. ఆమె పర్యటన ఏక చైనా సిద్ధాంతానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టడమేనని స్పెయిన్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ అధ్యక్షుడు జోస్‌ లూయిస్‌ సెంటెల్లా అన్నారు. పెలోసి పర్యటన ‘‘అమెరికా`చైనాల మధ్య సంబంధాలను ప్రభావితం చేయడమే కాకుండా, మొత్తం గ్రహాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసే ఉద్రిక్తతలను సృష్టిస్తుంది’’ అని స్పెయిన్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ పేర్కొంది.
తైవాన్‌ పండ్లు, చేపల దిగుమతిపై చైనా ఆంక్షలు
పెలోసీ తైవాన్‌లో పర్యటించిన నేపథ్యంలో తైవాన్‌ నుంచి దిగుమతి చేసుకునే పండ్లు, చేపలపై చైనా ఆంక్షలను ప్రకటించింది. తైవాన్‌కి పంపనున్న ఇసుక రవాణాను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. పెలోసీ తైవాన్‌ పర్యటన చైనాతో దౌత్యపరమైన సమస్యలు తలెత్తాయి. సిట్రస్‌ జాతికి చెందిన కొన్ని రకాల పండ్లు, చేపల దిగుమతిని నిషేధించినట్లు చైనా కస్టమ్స్‌ శాఖ తెలిపింది. పండ్లు, చేపల్లో క్రిమిసంహారకాలు ఎక్కువ శాతం ఉన్నాయని, కొన్ని ప్యాకెట్లలో కరోనా టెస్టు పాజిటివ్‌ వస్తుందని కస్టమ్స్‌ శాఖ తెలిపింది. సహజమైన ఇసుకను తైవాన్‌కు ఎగుమతి చేసే అంశంపై నిషేధం విధిస్తున్నట్లు చైనా వాణిజ్య శాఖ నోటీసు ఇచ్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img