Friday, April 19, 2024
Friday, April 19, 2024

చైనాలో కరోనా విజృంభణ.. ఒకే రోజు 3.7 కోట్ల మందికి వైరస్‌

కరోనా మహమ్మారి దెబ్బకు చ్కెనా విలవిల్లాడుతోంది. కనీవినీ ఎరుగని స్థాయిలో నమోదవుతున్న కేసులతో చ్కెనా దిక్కుతోచని స్థితిలోకి జారుకుంటోంది. డిసెంబర్‌ తొలి 20 రోజుల్లో దాదాపు 24.8 కోట్ల మందికి వైరస్‌ సోకింది. ఇది చ్కెనా మొత్తం జనాభాలో 18 శాతానికి సమానం.చ్కెనా నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ నిన్న అంతర్గతంగా సమావేశమయింది. ఈ సమావేశానికి సంబంధించిన మినిట్స్‌ లో దిగ్భ్రాంతికి గురి చేసే ఈ విషయం ఉంది. అంతేకాదు, ఈ వారంలో ఒకే రోజున 3.7 కోట్ల మంది కరోనా బారిన పడ్డారు. చ్కెనాలో ఇంతకు ముందు ఒకే రోజున నమోద్కెన అత్యధిక కేసుల సంఖ్య 40 లక్షలు. ఈ ఏడాది జనవరి 19న ఈ మేరకు కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఏకంగా ఒకే రోజున దాదాపు 4 కోట్ల కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. ప్రపంచంలో ఇంతవరకు ఏ దేశంలో కూడా ఒకే రోజున ఈ స్థాయిలో కేసులు నమోదు కాలేదు. ఈ కేసుల సంఖ్యను చూస్తే చ్కెనాలో కరోనా తీవ్రత ఎంత భయంకరంగా ఉందో చెప్పొచ్చు. అయితే ఈ మీటింగ్‌ మినిట్స్‌ లో కరోనా మరణాలు ఎన్ని నమోదయ్యాయనే విషయాన్ని మాత్రం పేర్కొనకపోవడం గమనార్హం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img