Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

చైనా`సిరియా దౌత్య సంబంధాలు మరింత పటిష్ఠం

సిరియా : చైనా, సిరియా దేశాల మధ్య 65 సంవత్సరాల దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తామని ప్రతిజ్ఞ చేశాయి. డమాస్కస్‌లో 65సంవత్సరాల దౌత్యసంబంధాల ఉత్సవాల్లో భాగంగా చైనా, సిరియా దేశాల మధ్య సహకారాన్ని మరింత పటిష్టపరుస్తామన్నారు. సిరియాలో చైనా రాయబారి ఫెంగ్‌ బియావో మాట్లాడుతూ..బీజింగ్‌ ప్రతిపాదించిన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ నిర్మాణంలో భాగస్వాములుగా చైనా, సిరియాలు సంయుక్తంగా పరస్పర ప్రయెజనకరమైన సహకారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు సమర్థవంతగా పనిచేస్తామన్నారు. సిరియా తూర్పుప్రాంతంలో వ్యూహాత్మక సామరస్యాన్ని అమలు చేస్తామన్నారు. దశాబ్దానికి పైగా సిరియాలో ఆ దేశ పునర్నిర్మాణంలో కీలక మిత్రులుగా ఉన్న చైనా, రష్యాలతో తమ సంబంధాలను మరింత బలోపేతం చేస్తామని సిరియా ప్రభుత్వ ప్రతినిధి మిక్దాద్‌ పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక స్నేహానికి నూతన పునాది వేసినట్లు ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి నూతన చైతన్యం జోడిరచామని ఫెంగ్‌ పేర్కొన్నారు. చైనా ఎల్లప్పుడూ సిరియా సార్వభౌమత్వానికి, ప్రాదేశిక సమగ్రతకు మద్దతు ఇస్తుందన్నారు.
సిరియా వ్యవహారాల్లో విదేశీ జోక్యానికి తావుండదని అన్నారు. ఫైసల్‌ మిక్దాద్‌ మాట్లాడుతూ..రెండు దేశాలపై అమెరికా ఆధిపత్యాన్ని, ఆంక్షలను తీవ్ర స్థాయిలో ఖండిరచారు. సిరియా దేశ సార్వభౌమత్వం, స్వాతంత్య్రాన్ని పరిరక్షించడంలో చైనా సిరియన్‌ ప్రజలకు అండగా నిలబడి అంతర్జాతీయ న్యాయానికి కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు.65 సంవత్సరాల దౌత్య సంబంధాలను సుస్థిరం చేసుకుంటామని మిక్దాద్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img