Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

చైనా నూతన ప్రస్థాన సారధి జిన్‌పింగ్‌

బీజింగ్‌: చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) ప్రధాన కార్యదర్శిగా 10 సంవత్సరాలపాటు అధికారంలో ఉన్న తరువాత జిన్‌పింగ్‌ (69) మరోసారి పత్రికా విలేకరుల ఎదుట నిలిచారు. ఆధునికీకరణకు చైనా మార్గం ద్వారా జాతీయ పునరుజ్జీవనం ప్రేరేపణకు దేశాన్ని ముందుకు నడిపిస్తానని ప్రతిజ్ఞ చేశారు. పార్టీ, మన ప్రజల గొప్ప విశ్వాసాన్ని రుజువు చేయడానికి పార్టీ స్వభావాన్ని, లక్ష్యాన్ని, బాధ్యతను మనస్సులో ఉంచుకొని మన విధి నిర్వహణలో శ్రద్ధగా పనిచేయాలని సీపీసీ 20వ మహాసభలు సీపీసీ ప్రధాన కార్యదర్శిగా తనను ఎన్నుకున్న అనంతరం ఆదివారం తన సహచరులతో కలిసి పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొన్న జిగ్‌పింగ్‌ పై విధంగా ఉద్బోధించారు.ప్రజల మెరుగైన జీవనానికి కృషి చేస్తూ, పార్టీ అంతర్గత సమస్యలను పరిష్కరిస్తూ జాతీయ పునరుజ్జీవనం కోసం తను, తన సహచరులు సీపీసీకి నేతృత్వం వహిస్తారని 2012లో సీపీసీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన అనంతరం జిన్‌పింగ్‌ చెప్పారు. ఆయన నేతృత్వంలో చైనా చారిత్రాత్మక మార్పులను చవిచూసింది. దేశ ఆర్థిక వ్యవస్థ రెట్టింపై 114 లక్షల కోట్ల యువాన్‌లకు (16 లక్షల కోట్ల డాలర్లు) చేరింది. దేశంలో పేదరికం నిర్మూలించబడి, దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు మితసౌభాగ్యాన్ని పొందారు. ఆ దశాబ్దం తీవ్ర సవాళ్లను కూడా ఎదుర్కొంది. కోవిడ్‌19 మహమ్మారి, అమెరికాతో వాణిజ్య యుద్ధం, ఆర్థిక వ్యవస్థపై అధోముఖ ఒత్తిడి ఇవన్నీ చైనా అభివృద్ధికి ప్రతిబంధకాలయ్యాయి. జిన్‌పింగ్‌కు, ఆయన నాయకత్వం వహిస్తున్న పార్టీ బలానికి పరీక్షగా అవి నిలిచాయి.
మైలురాయి పరివర్తనలను తీసుకువచ్చి, చైనా లక్షణాలతో సోషలిజం కొరకు ‘నూతన శకాన్ని’ ఆవిష్కరించి, ఇబ్బందులన్నింటినీ అధిగమించి, సంపూర్ణ ఆధునికీకరణను చేపట్టడంతో దేశాన్ని ముందుకు నడపడంలో సమర్ధుడిగా జిన్‌పింగ్‌ పరిగణించబడ్డారు. చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్‌ తాను చూసిన ప్రతిదానిని బట్టి ప్రస్తుత దశంలో చైనా అభివృద్ధికి అత్యంత ప్రధానమైన చైనా ప్రజలే ఆయనకు ప్రేరణ అని బ్రిటన్‌ 48 గ్రూప్‌ క్లబ్‌ చైర్మన్‌ స్టీఫెన్‌ పెర్రీ పేర్కొన్నారు. జిన్‌పింగ్‌కు ఒక లక్ష్యం, చైనా ప్రస్తుత పరిస్థితిపై సమగ్ర అవగాహన, దాని భవిష్యత్‌ పట్ల సవివరమైన, హేతుబద్ధ ఆలోచన ఉందని ‘చైనా నాయకులు ఏ విధంగా ఆలోచిస్తారు’ పుస్తక రచయిత, అమెరికా మేధావి రాబర్ట్‌ కూన్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img