Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

చైనా విద్యావ్యవస్థలో సంస్కరణలు

సోషలిజంపై విద్యార్థులకు అవగాహన

షాంఘై : చైనా విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌ పిలుపునిచ్చారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పుకు జిన్‌పింగ్‌ కంకణం కట్టుకున్నారు. దేశ యువతలో అవగాహన పెంచేందుకు గాను మార్క్సిజం సిద్ధాంతాన్ని జాతీయ పాఠ్యాంశాలలో చేర్చేందుకు విద్యా శాఖ నూతన మార్గదర్శకాలను మంగళవారం విడుదల చేసింది. విద్యార్థులకు సోషలిజంపై అలోచన, అవగాహన నను కల్పించేందుకుగాను ప్రాథమిక స్థాయి నుంచి విశ్వ విద్యాలయం వరకు బోధిస్తారు. ఈ అంశాలు విద్యార్థుల్లో దేశభక్తి భావాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. దీనికి గాను తగిన మార్గదర్శకాలను చైనా విద్యాశాఖ ప్రచురిం చింది. విద్యారంగంలో జిన్‌పింగ్‌ ఆలోచనా విధానాన్ని అన్ని చైనా పాఠశాలల్లో ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమం అయింది. చైనాలో వేసవికాలం (జూన్‌ నుంచి ఆగస్టు) పాఠశాలల్లో ప్రధానంగా పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ప్రారం భమైంది. అనేక ప్రైవేట్‌ పాఠశాలను ప్రభుత్వ యాజమా న్యంలోకి తీసుకున్నారు. విద్యను వ్యాపారపరంగా లాభార్జన కోసం నడిపే యంత్రాంగంపై కఠినమైన ఆంక్షలు విధిం చారు. దేశవ్యాప్తంగా ప్రైవేటు ట్యూషన్లను నిషేధించారు. ‘హైపర్‌`కాంపిటీటివ్‌’ ప్రాతిపదికన పరీక్షలు, యూని వర్సిటీల్లో ప్లేస్‌మెంట్స్‌కోసం, జాబ్‌ మార్కెట్లకోసం విద్యార్థు లకు అదనంగా ప్రైవేట్లకోసం తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలు బాల్యంలో సంతోషంగా ఉండాలని ఆశిస్తారు..కానీ కాంపిటీషన్‌లో తమ పిల్లలు వెనకబడిపోతారని భయపడతారు. అందరికీ సమా నంగా విద్య అన్న ప్రాతిపదికన కమ్యూనిస్టుపార్టీ దేశంలో అసమానతలను పరిష్కరిస్తుందని జిన్‌పింగ్‌ హామీ ఇచ్చారు. చైనీస్‌ విద్యార్థులకు క్షేత్రస్థాయి నుంచే మార్క్సిజంపై అవగాహన కోసం నూతన మార్గదర్శకాలను పార్టీ సూచిం చింది. ఈ మార్గదర్శకాలు చైనా లక్షణాలతో కూడిన సోషలి జం మార్గం, సిద్ధాంతం, వ్యవస్థ, సంస్కృతిపై పిల్లలకు అవగాహన కల్పిస్తారు. ముఖ్యంగా పాఠశాల విద్యలో కార్మిక విద్యను ప్రత్యేక అంశంగా ప్రవేశపెట్టింది. విద్యార్థులు ఇంటి పనుల నుండి కమ్యూనిటీ సేవలు, కార్మికులు చేసే పనిపై అవగాహన కల్పించేందుకు సామాజికంగా సేవలను అందించవలసి ఉంటుంది. మావో కాలం నాటి గ్రామీణ ప్రాంత ఉద్యమంలో భాగంగా విద్యార్థులను రైతులుగా పని చేయడానికి పంపిన వేల మంది పట్టణ పిల్లలో అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఒకరు. ఈ పనులు విద్యార్థుల్లో సమాజ స్పూర్తిని రగిలిస్తాయి. విద్యార్థులకు శారీరక శ్రమపై అవగాహన కల్పిస్తూ కార్మికులను తక్కువగా చూడకుండా వారిపై గౌరవాన్ని కలిగిస్తాయి. 2017లో కమ్యూనిస్టు పార్టీ మార్గదర్శకంలో జిన్‌ పింగ్‌ ఈ ఆలోచనను అధికారికంగా స్వాగతించారు. మావో జెడాంగ్‌ కాలంనాటి సాంప్రదాయక సిద్ధాంతాలకు రూపకల్పన చేసిన మొదటి వ్యక్తి జిన్‌పింగ్‌ అని చెప్పవచ్చు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img