Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

చేయగలిగినదంతా చేస్తున్నాం…

కాబూల్‌ నుంచి అమెరికన్ల తరలింపు కష్టసాధ్యం : జో బైడెన్‌

వాషింగ్టన్‌ : కాబూల్‌ నుంచి అమెరికన్ల తరలింపు చరిత్రలోనే క్లిష్టప్రక్రియని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. ఈ ప్రక్రియ ఫలితం చివరకు ఎలా ఉంటుందో తాను హామీ ఇవ్వలేనన్నారు. శ్వేతసౌథం నుంచి టీవీ ద్వారా ప్రసంగించిన ఆయన ఎలాంటి హామీని తను ఇవ్వలేనని, ప్రతి అమెరికన్‌ తరలింపు నకు చేయగలిగినదంతా చేస్తున్నామని చెప్పుకొచ్చారు. చరిత్రలో ఇది అతి సుదీర్ఘమైన..క్లిష్టమైన పనిగా తెలిపారు. ప్రమాదకరమైన తాలిబన్‌ దళాలు చుట్టుముట్టి ఉండగా సామూహిక తరలింపు మాటలతో అయ్యే పని కాదని వ్యాఖ్యానించారు. నష్టం జరగకుండా చూడగలు గుతామా అన్నది చెప్పలేకున్నానని బైడన్‌ అన్నారు. కమాండర్‌-ఇన్‌-చీఫ్‌గా తమ పౌరుల తరలింపునకు ఉన్న ప్రతి అవకాశాన్ని, ప్రతి వనరును వాడుతున్నట్లు తెలిపారు. జులై నుంచి 18 వేలమంది, ఈనెల 14 నాటికి 13వేల మందిని అమెరికన్‌ విమానాలు తరలించాయన్నారు. ఆగస్టు 31కి అఫ్గాన్‌ నుంచి మొత్తం అమెరికన్లను తేగలమని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. అక్కడున్న మిలిటరీ కమాండర్ల ఉత్తర్వులను సమర్థించబోనన్నారు. అమెరికన్లను సురక్షితంగా తరలించడానికి జరిగే ప్రయత్నాలను సమన్వయ పరచాలని తాలిబన్లను కోరుతున్నామని, వారితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. అమెరికా దళాలపై దాడికి యత్నిస్తే తీవ్ర పరిణామాలను తప్పబోవని హెచ్చరించినట్లు బైడన్‌ తెలిపారు. అఫ్గాన్‌లో ప్రస్తుత పరిస్థితిపై బ్రిటన్‌, ఫ్రాన్స్‌ వంటి ఇతర మిత్రదేశాలతో అమెరికా మాట్లాడిరద న్నారు. అఫ్గానిస్థాన్‌ ఉంచి తన సైన్యాన్ని ఉపసంహరిం చుకోవడానికి ఆగస్టు 31 వరకు గడువు ఉందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img