Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

జపాన్‌ పార్లమెంటు రద్దు

31న ఎన్నికలు
టోక్యో : జపాన్‌ పార్లమెంటును గురువారం రదు ్దచేసింది. అక్టోబరు 31న సాధారణ ఎన్నికలకు సిద్ధమైంది. జపాన్‌ నూతన ప్రధాని ఫ్యూమియో కిషిడా లిబరల్‌ డెమొక్రటిక్‌పార్టీ (ఎల్‌డీపీ) కొమిటో పార్టీ సంకీర్ణ భాగస్వామిగా ఎన్నికల్లో మెజారిటీ లక్ష్యంగా పేర్కొంది. తాము ఏమి చేయాలనుకుంటున్నారో, ఏమి లక్ష్యంగా పెట్టుకున్నామో ప్రజలకు చెప్పేందుకు ఎన్నికల్లో విజయం సాధిస్తానని కిషిడా విశ్వాసం వ్యక్తం చేశారు. సంకీ వార్తాపత్రిక తాజా నివేదిక ఆధారంగా సుమారు 48శాతం మంది కిషిడాపాలనలో ఆర్థిక పునరుద్ధరణకు, కరోనా నియంత్రణకు మరింతగాపనిచేయాలని కోరారు. బాలిస్టిక్‌ క్షిపణులను ధ్వంసం చేసే సామర్థ్యాన్ని పొందేందుకు రక్షణ వ్యయాన్ని భారీగా పెంచాలని పిలుపునిచ్చింది. కిషిడా పార్టీ ఈ ఏడాది నోటి ద్వారా తీసుకునే యాంటివైరల్‌ ఔషధాలను సరఫరా చేయడంతోపాటు ఆర్థికవృద్ధికి. నూతన పెట్టుబడీదారీ విధానానికి నిర్ణయించారు. ఎడానో నేతృత్వంలోని కానిస్టిట్యూషనల్‌ డెమొక్రాట్స్‌(సీడీపీజే) స్వలిగం వివాహానికి మద్దతు పలకుతున్నట్లు ప్రకటించారు. అన్ని రాష్ట్రాల్లో ప్రచారం ముమ్మరమైంది. అయితే అధికారికంగా ప్రచారం అక్టోబరు 19న ప్రారంభమవుతుంది. 31న ఓటింగ్‌ జరుగుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img