Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

జర్మనీని ముంచెత్తిన వరదలు

33 మంది మృతిడజన్లమంది గల్లంతు

బెర్లిన్‌: జర్మనీ పశ్చిమ ప్రాంతాన్ని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. కుండపోత వర్షాలతో పశ్చిమ, మధ్య జర్మనీలోని కొన్ని ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నదులు, జలాశయాలు పొంగి పొర్లుతున్నాయి. దీనివల్ల రవాణాకు పూర్తి అంతరాయం ఏర్పడిరది. నార్త్‌ రైన్‌ వెస్ట్‌ఫాలియా, రైన్‌లాండ్‌పాలటినేట్‌ రాష్ట్రాల్లో వరద ముప్పుతో 33 మంది మృతిచెందగా 70 నుంచి 100 మంది గల్లంతయ్యారు. ప్రజలు ప్రమాదంలో ఉన్నారని ఆయా రాష్ట్రాల గవర్నర్‌లు తెలిపారు. కుండపోత వర్షాలతో భవనాలు, కార్లతోపాటు రైలు మార్గాలు, రహదార్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. పొరుగున ఉన్న బెల్జియంలో తుపాను బీభత్సానికి ఆరుగురు మరణించారు. వెర్వియర్స్‌ నగరంలో కార్లు కొట్టుకుపోతున్న దృశ్యం ఆశ్చర్యాన్ని కలిగించింది. లీజ్‌ నగరం పూర్తిగా నీటమునిగింది. ప్రధాన నదుల కట్టలు తెగిపోయాయి. నెదర్లాండ్స్‌ సైతం వర్షానికి తీవ్రంగా దెబ్బతింది. దక్షిణ ప్రావిన్స్‌లోని లిబ్జర్గోలో చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. ప్రజలు ఇళ్లను ఖాళీచేయవలసిన పరిస్థితి. తుపాను బీభత్సంతో పల్లపు ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. పశ్చిమ జర్మనీ ప్రాంతం యుస్కిర్చెన్‌ వరద ముంపుతో 8మంది మరణించారు. 200 మంది సైన్యం సహాయక చర్యలు చేపట్టింది. కొలోన్‌కు నైరుతి దిశలో ఉన్న కౌంటీలోని కొన్ని ప్రాంతాల్లో ఫోన్లు, ఇంటర్నెట్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడిరది. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. పశ్చిమ ప్రాంత నగరం కొబ్లెంజ్‌లోని అహర్‌వీలర్‌ కౌంటీలో నలుగురు మరణించినట్లు తెలుస్తోంది. కొలోన్‌కు నైరుతి దిశలోని అగ్నిపర్వత ప్రాంతం ఈఫెల్‌లోని షుల్జ్‌ గ్రామంలో అనేక ఇళ్లు కూలిపోవడంతో 100 మంది వరకు నిరాశ్రయులయ్యారు. రక్షణ కోసం డజన్ల మంది ఇళ్లపైకప్పులకు ఎక్కారు. హెలికాప్టర్లతో అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. జర్మనీలోని అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం నార్త్‌`రైనా వెస్ట్‌ఫాలియాలో పెద్ద సంఖ్యలో రైలు సర్వీసులు నిలిపివేశారు. బెల్జియం సరిహద్దులోని వెస్ట్రే నది పొంగిపొర్లడంతో సమీప ప్రాంతాలు నీటమునిగాయి. అనేక గృహాలు కూలిపోయాయని మేయర్‌ ఫిలిప్‌గోడిన్‌ తెలిపారు. జర్మన్‌ సరిహద్దులోని తూర్పు బెల్జియం పట్టణాలు పూర్తిగా నీటమునిగాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img