Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

జర్మనీలో ఎన్నికలు నేడే

ఫ్రాంక్‌ఫర్ట్‌ : జర్మనీ ఫెడరల్‌ పార్లమెంటు దిగువ సభ బుండెన్‌టాగ్‌ను ఈ నెల 26 ఆదివారం జరిగే ఎన్నికల ద్వారా ప్రజలు ఎన్నుకుంటారు. వ్యక్తిగతంగా ఓటింగ్‌ ఆ రోజు జరిగినప్పటికీ పోస్టల్‌్‌ ఓటింగ్‌ ఇప్పటికే ప్రారంభమైంది. 18ఏళ్లు నిండిన దాదాపు 60.4 మిలియన్ల మంది జర్మన్లు ఓటు వేయడానికి అర్హులు. ఈ ఎన్నికలో 598 మంది సభ్యులను ఎన్నుకుంటారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా ఉన్నట్లు తెలు స్తోంది. మూడు ప్రధాన పార్టీలు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. మెర్కెల్‌కు చెందిన క్రిస్టియన్‌ డెమొక్రటిక్‌ యూనియన్‌(సీడీయూ) దశాబ్దాలుగా జర్మనీ రాజకీయాల్లో ఆధిపత్యం వహించింది. సీడీయూ, క్రిస్టియన్‌ సోషల్‌ యూనియన్‌ (సీఎస్‌యూ) సంకీర్ణ ప్రభుత్వం ఇప్పటివరక జర్మనీలో అధికారంలో ఉంది. గ్రీన్స్‌ పార్టీ నాయకురాలు అన్నలెనా బేర్‌బాక్‌ పోటీలో ఉన్నారు. సంకీర్ణ ప్రభు త్వంలో లిబరల్‌ ఫ్రీ డెమొక్రాట్లు, సోషలిస్టు ది లింకే ఉన్నారు. సాధారణంగా ఎక్కువ సీట్లు ఉన్న సంకీర్ణ పార్టీ ఛాన్సలర్‌ను ఎంపిక చేస్తుంది. జర్మనీలోని శ్రామికులు, యువత, సామాజిక ప్రజాస్వామ్యవాదులకు మంచి భవిష్యత్తుకు, విప్లవాత్మక మార్పుకోసం జర్మన్‌ కమ్యూనిస్టు పార్టీకి(డీకేపీ) ఓటువేసేందుకు ప్రజలు అత్యంత ఉత్సాహంగా ఉన్నారని డీకేపీ వార్తాపత్రిక ‘అన్‌సెర్‌ జీత్‌’లో ఇటీవల సంపాదకీయంలో వెల్లడిరచింది. బూర్జు వా అవకాశవాద పార్టీలను ఈ ఎన్నికల్లో తిరస్కరించాలని ప్రజల నిర్ణయంగా తెలిపింది. విప్లవాత్మక ప్రత్యామ్నా యాన్ని బలోపేతం చేసేందుకు జర్మన్‌ కమ్యూనిస్టు పార్టీకి ఓటు వేయాలని ప్రజలను కోరింది. అయితే ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన ఫలితం వెలువడకపోతే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడేందుకు అవకాశం ఉంది. డీకేపీ ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధించే ప్రయత్నం గత జులైలో ఫెడరల్‌ ఎలక్షన్‌ కమిషన్‌ బెదిరించింది. ఫెడరల్‌ రాజ్యాంగ న్యాయస్థానం ఎన్నికల కమిటీ నిర్ణయాన్ని రద్దు చేసింది. కమ్యూనిస్టు పార్టీ ఎన్నికల్లో పాల్గొనేందుకు నిర్ణయించింది. ఈ ఎన్నికల్లో మెర్కెల్‌కు చెందిన మధ్యే మితవాద సీడీయూ`సీఎస్‌యూ కూటమికి అవకాశాలు ఎక్కువగా ఉండకపోవచ్చు. వారి తరఫున ఆర్మిన్‌ లాచెట్‌ను చాన్సలర్‌ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఆర్థికమంత్రి, వైస్‌ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ స్కోల్జ్‌ ఆయనకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంన్నారు. మధ్యే వామపక్ష సోషల్‌ డెమొక్రాట్లు (ఎస్‌పీడీ) కి చెందిన ఆయన మెర్కెల్‌కు వారసుడిగా చెప్పుకుంటున్నారు. పశ్చిమ దేశాలన్నీ అత్యంత ఆత్రుతగా ఈ ఎన్నికల ఫలితాల కోసం చూస్తున్నారను. తాజా ఒపీనియన్‌ పోల్స్‌లో స్కోల్జ్‌ పార్టీ ఎస్‌పీడీ కన్సర్వేటివ్‌ల కన్నా ఎక్కువగా 25శాతం మద్దతుతో ముందంజలో ఉంది. ఓటింగ్‌ ఫలితాలు వెల్లడయేందుకు ఇంకా మూడు రోజులు ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img