Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

జర్మనీ అధ్యక్షుడిగా స్టెయిన్‌మెయర్‌

బెర్లిన్‌: జర్మనీ అధ్యక్షుడిగా ఫ్రాంక్‌ వాల్టర్‌ స్టెయిన్‌ మెయర్‌(66) తిరిగి ఎన్నికయ్యారు. ఈ పదవిలో వాల్టర్‌ మరో ఐదేళ్ల పాటు పదవిలో కొనసా గుతారు. పార్లమెంటు ఆదివారం ప్రత్యేకంగా సమా వేశమై ఆయనను మరోసారి అధ్యక్షునిగా ఎన్ను కుంది. అధికార పక్షంతో పాటు విపక్షాలు కూడా మెయర్‌ అభ్యర్థిత్వానికి మద్దతు పలికాయి. మాజీ చాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ హయాంలో స్టెయిన్‌ మెయర్‌ రెండుసార్లు విదేశాంగ మంత్రిగా పని చేశారు. జర్మనీ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన స్టెయిన్‌మెయర్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అభినందనలు తెలిపారు. చైనా, జర్మనీల మధ్య దౌత్య సంబంధాల స్థాపనకు ఈ సంవత్సరం 50 ఏళ్లు పూర్తవుతున్నాయని అభినందన సందేశంలో జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. చైనా-జర్మనీ సంబంధాల అభివృద్ధికి తాను అత్యధిక ప్రాముఖ్యత నిస్తున్నా నని, రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వా మ్యానికి, ద్వైపాక్షిక సంబంధాలను నూతన స్థాయికి తీసుకెళ్లడానికి స్టెయిన్‌మెయర్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని జిన్‌పింగ్‌ వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img