Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

జాత్యహంకారంపై గళమెత్తిన బ్రిటన్‌ కమ్యూనిస్టులు

లండన్‌ : ‘‘డౌనింగ్‌ స్ట్రీట్‌ మార్పు సరిపోదు’’ అంటూ జాన్సన్‌ ప్రభుత్వ పతనంపై బ్రిటిష్‌ కమ్యూనిస్టులు మండిపడ్డారు. కన్సర్వేటివ్‌ పాలకుల ప్రభుత్వ విధానాలు, ప్రజాస్వామ్య వ్యతిరేక, జాత్యహంకార, యుద్ధ ప్రేరేపణా చర్యలు తమ ఎజెండాను మార్చవని బ్రిటన్‌ కమ్యూనిస్టుపార్టీ సభ్యుడు టోనీ కాన్వే ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిటన్‌ కమ్యూనిస్టులు జీవన వ్యయం, గృహనిర్మాణం, వాతావరణ మార్పులు, ఆహార సంక్షోభాలపై కార్మిక సంఘాలు, ప్రచార ఉద్యమాలు ఐక్యంగా స్పందించాలని పిలుపునిచ్చారు. ఉద్యోగాలు, సేవలు, జీవన వేతనం కోసం జరిగే పోరాటంలో రైల్వే కార్మికులు, సామాన్యులు, లెక్చరర్లు, న్యాయవాదులతో చేరేందుకు కమ్యూనికేషన్స్‌, సివిల్‌ సర్వీస్‌ సిబ్బంది, కార్మికులకు సంఫీుభావాన్ని ప్రకటించారు.కార్మికుల కోసం టౌన్‌ హాల్‌ సమావేశాలు, పీపుల్స్‌ అసెంబ్లీ నిర్మాణం, కార్యాచరణ అవసరమని కాన్వే పేర్కొన్నారు. రువాండాకు శరణార్థుల బహిష్కరించడానికి బ్రిటిష్‌ ప్రభుత్వ విధానాన్ని రద్దు చేయవలసిన అవసరాన్ని కూడా నొక్కిచెప్పారు,

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img