Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

జీ-20 అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన భారత్‌

ఇండోనేషియా నుంచి అధ్యక్ష బాధ్యతలు భారత్‌కు బదిలీ
బలమైన ఆర్థిక వ్యవస్థగా అగ్రరాజ్యాలకు దీటుగా దూసుకుపోతున్న భారత్‌ కు విశిష్ట ఘనత దక్కింది. ప్రపంచ దేశాల్లో బలమైన కూటమిగా పేరుపొందిన జీ-20 అధ్యక్ష బాధ్యతలను భారత్‌ నేడు చేపట్టింది. ఇటీవల ఇండోనేషియాలో జరిగిన జీ-20 సమావేశాల్లో ఈ బాధ్యతలను భారత్‌ కు బదిలీ చేశారు. డిసెంబరు 1 నుంచి జీ-20 అధ్యక్ష బాధ్యతలను భారత్‌ నిర్వర్తిస్తుందని ఆ సమావేశంలో ప్రకటించారు. భారత్‌ ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగనుంది. ఈ ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా 32 ప్రాంతాల్లో వివిధ అంశాలపై 200 సమావేశాలను నిర్వహించనున్నారు. జీ-20 అధ్యక్ష బాధ్యతల నేపథ్యంలో ప్రత్యేక లోగోను రూపొందించారు. దేశంలోని 100 స్మారక చిహ్నాలపై ఈ లోగోను ప్రదర్శించనున్నారు. ఈ లోగోను త్రివర్ణ పతాకం స్ఫూర్తిగా రూపొందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img