Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

టర్కీ అధ్యక్షుడి ఎన్నికపై ఉత్కంఠ
28న రెండో రౌండ్‌ పోలింగ్‌

ఇస్లాంబుల్‌: టర్కీ అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారాయి. పోటీలో ఉన్న ఇద్దరు అభ్యర్థులకు 50శాతం మేర ఓట్లు రావడంతో మరోదఫా పోలింగ్‌ అనివార్యమైంది. దీంతో ఈనెల 28న రెండో రౌండు ‘రన్‌ ఆఫ్‌’ ఎన్నికలు జరగనున్నాయి. తద్వారా టర్కీ అధ్యక్షుడిగా ఎర్దోగన్‌ కొనసాగుతారా లేక ఆయన ప్రత్యర్థి కెమల్‌ కిలిచ్దారోగ్లు అధ్యక్ష పగ్గాలు చేపడతారా అన్నది తేలిపోతుంది. ఇస్తాంబుల్‌, ఇజ్మీర్‌, అంకారతో పాటు అనేక ప్రధాన నగరాల్లో కలిచ్దారోగ్లు విజేతగా నిలవగా అధిక ఓటర్లున్న రూరల్‌లో ఎర్దోగన్‌ క్లీన్‌స్వీప్‌ చేశారు. ఇంకా 300 బ్యాలెట్‌ బాక్సులలో ఓట్లు లెక్కించాల్సి ఉంది. ఇప్పటివరకు ఎర్దోగన్‌కు 49.51శాతం, కిలిచ్దారోగ్లుకు 44.88శాతం, సిన్‌ ఓగన్‌కు 5.17శాతం ఓట్లు వచ్చాయని తెలిసింది. ‘రన్‌ ఆఫ్‌ ఎన్నికలు’ నిర్వహించే క్రమంలో ఓర్గన్‌ ఓట్లు ఎర్దోగన్‌కు మళ్లే పరిస్థితి ఉన్నందున కిలిచ్దారోగ్లుకు ఎదురుదెబ్బ తగలవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఇద్దరు నేతలు తమ గెలుపుపై దీమాగా ఉన్నారు. తుది ఫలితాలు వెలువడక పోయినా గెలుపు మనదే అని ఏకే పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడిన ఎర్దోగన్‌ ఉద్ఘాటించారు. కిలిచ్దారోగ్లు కూడా రెండో రౌండులో గెలుపుపై దీమాగా ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img