Friday, April 19, 2024
Friday, April 19, 2024

టిబెట్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌

బీజింగ్‌ : చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ టిబెట్‌లో పర్యటిస్తున్నారు. గడచిన మూడు దశా బ్దాలలో చైనా అధ్యక్షుడు టిబెట్‌లో పర్యటించడం ఇదే ప్రథమం. టిబెట్‌ రాజధాని లాసా పర్యటనకు ముందు జిన్‌పింగ్‌ అరుణాచలప్రదేశ్‌కు 20 కిలోమీటర్ల దూరంలోని యర్లుంగ్‌ జాంగ్బో(బ్రహ్మపుత్ర) నదిపై బ్రిడ్జ్‌ పనులు పర్యవేక్షిం చారు. అరుణాచలప్రదేశ్‌ సరిహద్దు గ్రామాన్ని జిన్‌పింగ్‌ సందర్శిం చారు. జిన్‌పింగ్‌కు సంప్రదాయ దుస్తులు ధరించిన టిబెటియన్లు చైనా జెండాలు ఊపుతూ స్వాగతం చెప్పినట్లు చైనా జాతీయ మీడియా సీసీటీవీ ఫుటేజీని శుక్రవారం విడుదల చేసింది. చైనాలో షింజియాగ్‌ తర్వాత అత్యంత వివాదాస్పద ప్రాంతం టిబెట్‌. ఈ పర్యటనలో జిన్‌పింగ్‌ నయాంగ్‌ నది వంతెనను తిలకిం చారు. టిబెట్‌లోని గ్రేట్‌బెండ్‌ లోయ ప్రాంతంలో చైనా బ్రిడ్జి కడుతుండటంతో అక్కడి అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. జిన్‌పింగ్‌ 1998లో ఫుజియాన్‌ ప్రావిన్స్‌ పార్టీచీఫ్‌గా, 2011లో ఉపాధ్యక్ష హోదాలో టిబెట్‌ను సందర్శించారు. జిన్‌పింగ్‌ సిచువాన్‌టిబెట్‌ రైల్వేస్టేషన్‌, సిటీ ప్లానింగ్‌ మ్యూజియం సందర్శించి అధికారులతో చర్చించారు. 146 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులతో టిబెట్‌లోని వివిధ ప్రాజెక్టులను చైనా చేపట్టింది. టిబెట్‌నేపాల్‌ రైలు ప్రాజెక్టు, సిచువాన్‌`టిబెట్‌ రైలు లింక్‌ ప్రాజెక్టు, భారీ డ్రైపోర్టు నిర్మాణం వంటివి ఈ ప్రణాళికలో ఉన్నాయి. ఇవే కాకుండా వివిధ రంగాలకు చెందిన అభివృద్ధి పనులను చైనా చేపట్టింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img