. జాత్యాహంకారం, దుష్ప్రవర్తన కారణంగా తొలగింపు
. అక్టోబరులో కొత్త డైరెక్టర్ ఎన్నిక : డైరెక్టర్ జనరల్ ట్రెడోస్
లండన్: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తమ ఆసియా డైరెక్టర్‌పై వేటు వేసింది. ఆయనపై జాత్యాహంకారం, దుష్ప్రవర్తన ఆరోపణలు రుజువు అయినందునే పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కోవిడ్ మహమ్మారి వేళ ఐరాస ఆరోగ్య సంస్థ ప్రతిస్పందన విషయంలో రాజీ పడటమే కాకుండా సిబ్బందిపై జాత్యాహంకారాన్ని ప్రదర్శించడం, వారిని దూషించడం, అనైతికంగా ప్రవర్తించడం వంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. దీనిపై అంతర్గత దర్యాప్తు నిర్వహించగా అవి నిజమని తేలడంతో డబ్ల్యూహెచ్ఓ ఆసియా డైరెక్టర్ డాక్టర్ తకేషి కసాయ్ నియామకాన్ని రద్దు చేస్తూ సంస్థ డైరెక్టర్ జనరల్ ట్రెడోస్ అధానోమ్ ఘెబ్రేయేసస్ ఆదేశాలిచ్చారు. ఈ మేరకు ఈమెయిల్‌ను డబ్ల్యూహెచ్ఓ ఉద్యోగులకు ఆయన పంపారు. అందులో డాక్టర్ తకేషికి బదులు ఆయన హోదా ‘పశ్చిమ పసిఫిక్ ప్రాంతీయ డైరెక్టర్’ అని మాత్రమే రాశారు. కొత్త ప్రాంతీయ డైరెక్టర్ నియామకం ప్రక్రియ వచ్చే నెల నుంచి ప్రారంభమవుతుందని, అక్టోబరులో ఎన్నికలు ఉంటాయన్నారు. ఈ హోదా కోసం డాక్టర్ తకేషి పేరును జపాన్ ప్రభుత్వం సిఫార్సు చేసింది. అయితే తాజా పరిణామంపై ఇంకా స్పందించలేదు. తకేషి దుష్ప్రవర్తన గురించి అనేకమంది ఉద్యోగులు ఫిర్యాదు చేసినట్లు గతేడాదిలో అసోసియేషన్ ప్రెస్ వెల్లడిరచింది. దీనిని తీవ్రంగా పరిగణించిన డబ్ల్యూహెచ్ఓ అంతర్గత దర్యాప్తు నకు ఆదేశాలిచ్చింది. దర్యాప్తు నివేదికలో ఆరోపణలు రుజువు కావడంతో ఆయనను పదవి నుంచి తొలగించింది.