Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

డెడ్‌లైన్‌ దాటితే రెడ్‌లైనే…

అమెరికా, బ్రిటన్‌కు తాలిబన్ల హెచ్చరిక

కాబూల్‌ : ఆగస్టు 31 తరువాత కాబూల్‌లో మీ సైన్యం కనిపిస్తే డెడ్‌లైన్‌ కాస్త ‘రెడ్‌ లైన్‌ అవుతుందని అమెరికా, బ్రిటన్‌ దేశాలను తాలిబన్లు హెచ్చరిం చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బలగాల పొడిగింపునకు అనుమతించబోమని తాలిబన్ల అధికార ప్రతినిధి సుహైల్‌ షాహీన్‌ స్పష్టం చేశారు. జాప్యానికి తావుండరాదని, గడువు తీరితే జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఈ దేశాన్ని మీ ‘ఆధీనంలోనే’ ఉంచుకున్న పక్షంలో ప్రతీకార చర్యలకు దిగుతా మన్నారు. ఈనెల 31లోగా సైనికుల ఉపసంహరణ ముగియాలని తెలిపారు. అందుకు వ్యవధి కోరినా ఇవ్వమన్నారు. అఫ్గాన్‌లో తమ దేశస్థుల తరలింపు పూర్తికాని పక్షంలో సైనిక దళాల ఉపసంహరణను మరికొంత కాలం పొడిగించే అవకాశాలున్నా యని, దీనిపై చర్చలు జరుగుతున్నాయని బైడెన్‌ తాజాగా పేర్కొన్నారు. బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కూడా బైడెన్‌తో ఏకీభవించారు. జీ-7 సదస్సులో దీనిపై చర్చిద్దామన్నారు.
31లోగా ప్రజలను తరలిస్తాం.. : బైడెన్‌
వాషింగ్టన్‌ : అఫ్గాన్‌ నుంచి ప్రజల తరలింపు జోరుగా కొనసాగుతోంది. ఈ ప్రక్రియ 31వ తేదీలోగా పూర్తి కావచ్చు అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వెల్లడిరచారు. అమాయకులైన అఫ్గాన్లు లేదా అమెరికా దళాలే లక్ష్యంగా పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు ముష్కరులకు ఉన్నాయని వ్యాఖ్యానించారు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపారు. ప్రజలను తరలించే ప్రక్రియను ముగించేందుకు ఈనెల 31 వరకు గడువు పెట్టుకున్నట్లు చెప్పారు. ఇదే విషయమై తమ సైన్యంతో చర్చించినట్లు చెప్పారు. కాబూల్‌ విమానాశ్రయం వద్ద హృదయ విదారక దృశ్యాలు కలచివేశాయన్నారు. అఫ్గాన్‌లో 15 వేలమంది అమెరికన్లు, 50 వేలమంది అఫ్గాన్లు ఉన్టట్లు అంచనా ఉన్నట్లు అమెరికా ఇటీవల పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img