Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

డ్రోన్లపై రష్యా నిషేధం

15 వరకు 30 ప్రాంతాల్లో ఆంక్షలు
సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌పై డ్రోన్‌ దాడి నేపథ్యంలో ఆదేశంలోని 30 ప్రాంతాల్లో డ్రోన్లు ఎగురవేయకుండా నిషేధాజ్ఞలు జారీ అయ్యాయి. రెండు పెద్ద నగరాలతో పాటు అనేక ప్రాంతాల్లో డ్రోన్లపై రష్యా నిషేధం విధించింది. ఈనెల 15 వరకు తమ గగనతలంలో డ్రోన్లు ఎగిరేందుకు వీల్లేదని రష్యాలోని రెండవ అతిపెద్ద నగరమైన సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ అధికారులు తెలిపారు. ఏప్రిల్‌ చివరిలో నుంచే డ్రోన్లపై తాత్కాలిక నిషేధాన్ని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ అమలు చేసిందని ఏవియేషన్‌ అధికారి వెల్లడిరచినట్లు జిన్హువా వార్తాసంస్థ పేర్కొంది. సోమవారం లెనిన్‌గ్రాడ్‌లో పవర్‌లైన్‌ పైలాన్‌ పేలిపోయిన నేపథ్యంలో డ్రోన్లపై నిషేధం విధించినట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. డ్రోన్లపై నిషేధాన్ని లెనిన్‌గ్రాడ్‌ గవర్నర్‌ అలెగ్జాండర్‌ డ్రోజ్‌డెంకో ధ్రువీకరించారు. అయితే. మరిన్ని ప్రాంతాల్లోనూ ఈ ఆంక్షలు అమలు కానున్నట్ల్లు నిపుణులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img