Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

తాలిబన్ల చేతుల్లోకి పంజ్‌షేర్‌..?

పంజ్‌షేర్‌: అమెరికా బలగాల ఉపసంహరణతో విజృంభించిన తాలిబన్లు అఫ్గాన్‌ మొత్తాన్ని అక్రమించుకున్నారు. కానీ ఒక్క పంజ్‌షేర్‌ మాత్రం వారికి ఇంకా అందని ద్రాక్షలాగే మిగిలింది. తాజాగా ఈ ప్రాంతం కూడా తమ వశమైనట్లు తాలిబన్‌ వర్గాలు వెల్లడిరచాయి. అయితే తాలిబన్ల ప్రకటనను ఉత్తరకూటమి సేనలు ఖండిస్తున్నాయి. పంజ్‌షేర్‌ ఇంకా తమ ఆధీనంలోనే ఉందని చెబుతున్నాయి. ‘‘దేవుడి దయతో మొత్తం అఫ్గానిస్థాన్‌ మా నియంత్రణలోకి వచ్చేసింది. పంజ్‌షేర్‌ కూడా మా స్వాధీనంలోకి వచ్చేసింది’’ అని తాలిబన్‌ కమాండర్‌ ఒకరు తాజాగా ప్రకటించడం సంచలనంగా మారింది. పంజ్‌షేర్‌పై విజయంతో తాలిబన్లు సంబరాలు చేసుకుంటున్నట్లు సోషల్‌మీడియాలో కొందరు పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ వార్తలపై పూర్తి స్పష్టత రాలేదు. తాలిబన్ల ప్రకటనను తాలిబన్‌ వ్యతిరేక శక్తుల నాయకులు అమరుల్లా సలేప్‌ా, అహ్మద్‌ మసూద్‌ ఖండిరచారు.
పంజ్‌షేర్‌ ఇంకా తమ నియంత్రణలో ఉందని, తాలిబన్లకు తాము తలొగ్గేది లేదని వెల్లడిరచారు. ‘‘తాలిబన్లకు వ్యతిరేకంగా పోరు కొనసాగుతూనే ఉంది. మా మాతృభూమి కోసం మేం పోరాడుతూనే ఉంటాం’’ అని సలేప్‌ా ట్విటర్‌లో వెల్లడిరచారు. కాబుల్‌కు ఉత్తరాన దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉండే పంజ్‌షేర్‌ ప్రావిన్సు దశాబ్దాల నుంచి తాలిబన్లకు కొరకరాని కొయ్యే! హిందుకుష్‌ పర్వత శ్రేణుల్లోని ఈ ప్రాంతం శత్రు దుర్భేద్యం. పోరాటాలకు పెట్టింది పేరైన ఈ ప్రావిన్సు ప్రస్తుతం అహ్మద్‌ మసూద్‌ నాయకత్వంలో ఉంది. తాలిబన్ల విజృంభణ అనంతరం అఫ్గాన్‌ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేప్‌ా సహా గత ప్రభుత్వంలోని అనేక మంది నేతలు పంజ్‌షేర్‌కే వచ్చేశారు. ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకునేందుకు తాలిబన్లు భీకర పోరాటం జరుపుతున్నారు. తాలిబన్లను ఉత్తర కూటమి సేనలు కూడా అంతే దీటుగా నిలువరిస్తు న్నాయి. ఈ యుద్ధంలో పదుల సంఖ్యలో తాలిబన్లు మృతిచెందినట్లు వార్తలు కూడా వచ్చాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img