Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

తాలిబన్ల పాలనను గుర్తించం : వైట్‌ హౌస్‌

వాషింగ్టన్‌ : అఫ్గాన్‌లో తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించే సమస్యేలేదని అమెరికా స్పష్టం చేసింది. అమెరికా దళాల ఉపసంహరణ అనంతరం అఫ్గాన్‌లో దౌత్యకార్యాలయాలు ఉనికి కొనసాగించాలా..లేదా అనే దానిపై ఇంకా నిర్ణయించలేదని వైట్‌హౌస్‌ ప్రతినిధి జెన్‌ సాకి తెలిపారు. తాలిబన్‌ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించేం దుకు కొన్ని హామీలు ఇవ్వవలసి ఉందని అమెరికా వెల్లడిరచింది. ఉగ్రమూకలకు అఫ్గాన్‌ను కేంద్రంగా మార్చవద్దని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఉగ్రవాదం, మానవ హక్కులు, మహిళల హక్కులపై తమ నిర్ణయం ఆధారపడి ఉంటుం దన్నారు. అమెరికా పౌరుల రక్షణే తమ తొలి ప్రాధాన్యమని తేల్చి చెప్పింది. మంగళవారం బలగాల ఉపసంహరణ తర్వాత అమెరికా తాలిబన్లతో చర్చలు జరపాలని తాలిబన్లు కోరినట్లు అమెరికా అధికార ప్రతినిధి ప్రైజ్‌ తెలిపారు. నిర్ణయాలు తీసుకునేముందు అమెరికాకు మరిన్ని హామీలు ఇవ్వవలసిన అవసరం ఉందని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img