Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

తీవ్రవాదం, హింసపై కఠిన వైఖరి

అఫ్గాన్‌ సమస్యపై చైనా`అమెరికాల స్పందన

బీజింగ్‌ : అఫ్గానిస్తాన్‌లో నెలకొన్న తాజా పరిస్థితులపై చైనా విదేశాంగమంత్రి వాంగ్‌యీ అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్‌తో ఫోన్‌లో సంభాషించారు. అఫ్గాన్‌ సార్వభౌమత్వాన్ని, స్వాతంత్య్రాన్ని గౌరవించాలని వాంగ్‌ అమెరికాను కోరారు. అఫ్గాన్‌ ద్వంద్వ ప్రమాణాలు పాటించడం, ఉగ్రవాదాన్ని ఎదుర్కొవడమే కాకుండా తీవ్రవాదం, హింసను ఎదుర్కోవడంలో కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అఫ్గాన్‌లో అమెరికా సైనిక బలగాల ఉపసంహరణ, తరలింపు ముగింపు దశకు చేరుకోవడంతో అఫ్గాన్‌లో పరిస్థితి వివిధ మార్పులకు గురైందన్నారు. అన్ని పార్టీలు తాలి బన్‌లతో సంప్రదింపులు జరపడం ద్వారా మార్గ నిర్దేశం చేయడం అవసరమని వాంగ్‌ సూచించారు. ప్రత్యేకించి అఫ్గాన్‌కు అత్యవసరంగా అవసరమైన ఆర్థిక, జీవనోపాధి, మానవతా సహాయాన్ని అందించేందుకు అంతర్జాతీయ సమాజంతో కలిసి పనిచేయవలసిన అవసరాన్ని వాంగ్‌ నొక్కిచెప్పారు. అఫ్గాన్‌ రాజకీయ నిర్మాణం, ప్రభుత్వ సంస్థల సాధారణ కార్యకలాపాల నిర్వహణ, సామాజిక భద్రత, స్థిరత్వానికి కరెన్సీ తరుగుదల క్షీణత అరికట్టేందుకు శాంతియుత పునర్నిర్మాణం అవసర మని వాంగ్‌ చెప్పారు. ఉగ్రవాదాన్ని నిర్మూలిం చాలన్న లక్ష్యాన్ని ఆఫ్గాన్‌ యుద్ధం సాధించలేదన్న వాస్తవాన్ని నిరూపించిందని వాంగ్‌ పేర్కొన్నారు. నాటో, అమెరికా దళాల ఉపసంహరణ అఫ్గాన్‌లో తీవ్రవాద సంస్థలకు మళ్లీ అవకాశాన్ని అందించే అవకాశంగా పేర్కొన్నారు.
బ్లింకెన్‌ ఆఫ్గాన్‌ సమస్యపై చైనా ఆందోళన వ్యక్తం చేయడంపై సానుకూలతను వ్యక్తం చేశారు. ఆఫ్గాన్‌లో నెలకొన్న తాజా పరిస్థితి, వాతావరణ మార్పు వంటి సమస్యలపై రెండు దేశాలు ఇటీవల సంభాషించుకున్న సంగతిని వాంగ్‌ గుర్తుచేశారు. ఘర్షణ వాతావరణం కంటే సానుకూల చర్చలు ఉత్తమం, సంఘర్షణ కంటే సహకారం మేలు అని వాంగ్‌ అన్నారు, అమెరికా`చైనా ద్వైపాక్షిక సంబం ధాలు సానుకూలంగా ఉండాలంటే చైనాపై దాడి, చైనా సార్వభౌమత్వం, భద్రత, అభివృద్ధి ప్రయోజ నాలను దెబ్బతీయడం తగదని వాంగ్‌ అన్నారు.
బ్లింకెన్‌ మాట్లాడుతూ, అమెరికా కోవిడ్‌ -19 మూలాలను గుర్తించనందుకు ఏ దేశాన్ని నిందించే ఉద్దేశం లేదు. ప్రధానంగా అమెరికా, చైనా రెండూ దేశాలు అవసర మైన సమాచారాన్ని అందించడం, వైరస్‌ మూలాలను క్షుణ్ణంగా పరిశోధించడం, కరోనా మహమ్మారి పునరావృతం కాకుండా నివారించడం వంటి బాధ్యతలను చేపట్ట వలసిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో చైనాతో సన్నిహితంగా ఉండటానికి అమెరికా సిద్ధంగా ఉందని బ్లింకన్‌ హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img