Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

తైవాన్‌ జోలికి రావద్దని బైడెన్‌కు చైనా హెచ్చరిక

బీజింగ్‌: తైవాన్‌ స్వాతంత్య్రం, విదేశ శక్తుల జోక్యాన్ని చైనా గట్టిగా వ్యతిరేకిస్తుందని చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది. తైవాన్‌ ఉద్రిక్తతల నేపధ్యంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ సుమారు రెండు గంటపాటు టెలిఫోన్‌లో మాట్లాడుతున్నారు. రెండు దేశాల అధ్యక్షుల మధ్య గురువారం జరిగిన ఐదో విడత చర్చలు ఉదయం 8.33 నుంచి 10.50 గంటల వరకు కొనసాగినట్లు శ్వేతసౌధం తెలిపింది. అమెరికా హౌస్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసి తైవాన్‌ ద్వీపాన్ని సందర్శించడంపై ‘నిప్పుతో ఆడుకునేవారు దానివల్లనే నాశనం అవుతారని జిన్‌పింగ్‌ బైడెన్‌ను హెచ్చరించారు.పెలోసి, బైడెన్‌ వంటి డెమొక్రాట్‌లు తైవాన్‌ను సందర్శించినట్లయితే, చైనా సైనిక, ఆర్థిక బెదిరింపులను ఎదుర్కొంటున్నట్లు బీజింగ్‌ హెచ్చరికలను జారీ చేసింది. ‘‘నిప్పుతో ఆడుకునే వారు మాత్రమే కాలిపోతారు,’’ అని చైనా ప్రభుత్వ మీడియా జిన్‌పింగ్‌ బైడెన్‌తో చెప్పినట్లు పేర్కొంది. తైవాన్‌ విషయంపై అమెరికా పాలసీ మారదని బైడెన్‌ గుర్తుచేశారు.ఏకపక్షంగా పరిస్థితిని మార్చే ప్రయత్నం చేస్తే తైవాన్‌ జలసంధిలో శాంతి, స్థిరత్వం కొరవడుతుందని అమెరికా వర్గాలు వెల్లడిరచాయి. తైవాన్‌ ద్వీపాన్ని మార్చాలనుకునే చైనా ప్రతిపాదనను తీవ్రంగా, ఏకపక్షంగా ఖండిస్తున్నట్లు బైడెన్‌ తెలిపారు. తైవాన్‌ పట్ల అమెరికా విధానంలో మార్పు లేదని ఆయన అన్నారు. బైడెన్‌ వ్యాఖ్యలకు జిన్‌పింగ్‌ కూడా గట్టిగా కౌంటర్‌ ఇచ్చారు. వన్‌ చైనా సూత్రానికి తాము కట్టుబడి ఉన్నట్లు చైనా అధ్యక్షుడు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img