Friday, April 19, 2024
Friday, April 19, 2024

త్వరలో ఆస్ట్రేలియా సీపీ మహాసభలు

కాన్‌బెరా: ఆస్ట్రేలియా కమ్యూనిస్టు పార్టీ (సీపీఏ) 14వ జాతీయ మహాసభలు ఫిబ్రవరి 25-27 తేదీలలో జరుగనున్నాయి. ‘‘సోషలిస్టు భవిష్యత్తు కోసం పార్టీ నిర్మాణం’’ అనే నినాదం ఈ మహాసభలో మార్మోగనుంది. ఈ సమావేశంలో సోషలిజం నిర్మాణంలో కమ్యూనిస్టు పార్టీ వ్యూహాత్మక ప్రణాళికను రూపొందించనుంది. సీపీఏ నిర్మాణం చేపట్టి అక్టోబరు 30, 2021న 101 ఏళ్లు పూర్తి చేసుకుంది ఆస్ట్రేలియా శ్రామిక వర్గం కోసం ఒక శతాబ్ద కాల అనుభవాలను అందించడానికి మేము కట్టుబడి ఉన్నామని సీపీఏ పేర్కొంది. 2017లో జరిగిన సీపీఏ 13వ మహాసభల నుండి పార్టీ గణనీయమైన వృద్ధిని సాధించింది. ఈ సమావేశంలో ప్రధాన అజెండాగా కేడర్‌ అభివృద్ధి, ఆదివాసీల భూమి హక్కుల కోసం పోరాటం, ట్రేడ్‌ యూనియన్‌ హక్కులు, పర్యావరణం, శాంతి, కార్మికుల పోరాటం పెట్టుబడిదారీ వ్యవస్థ సృష్టించిన ఆర్థిక సంక్షోభాన్ని నివారణ, కార్మికుల సమస్యలపై చర్చిస్తారు. సామ్రాజ్యవాదం, తాజా ప్రచ్ఛన్న యుద్ధం ప్రయోజనం కోసం ఆస్ట్రేలియా ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా సంతకం చేసిన ఔకస్‌ ఒప్పందానికి వ్యతిరేకంగా కూడా పార్టీ ప్రచారం కొనసాగిస్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img