Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

త్వరలో రాజీనామా చేస్తున్నా


ప్రపంచ బ్యాంకు డైరెక్టర్‌ డేవిడ్‌ మాల్పాస్‌


వాషింగ్టన్‌: ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్‌ మాల్పాస్‌ (66) రాజీనామా చేయబోతున్నారు. ఈ మేరకు ఆయన ప్రకటించారు. జూన్‌ 1వ తేదీ నుంచి పదవి బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు వెల్లడిరచారు. ఆయన బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లకుపైగానే అయింది. పదవీకాలం ముగిసేందుకు మరో ఏడాది సమయం ఉంది. దీంతో ఆయన అర్థాంతరంగా పదవిలో నుంచి తప్పుకుంటుండటం చర్చనీయాంశంగా మారింది. కాగా, డేవిడ్‌ మాల్పాస్‌ రాజీనామా చేయబోతున్నట్లు ప్రపంచ బ్యాంకు వర్గాలు వెల్లడిరచాయి. ‘బాగా ఆలోచించే ఈ నిర్ణయానికొచ్చా. రాజీనామా చేయాలని అనుకుంటున్నట్లు బోర్డుకు సమాచారం ఇచ్చా’ అని మాల్పాస్‌ వెల్లడిరచారు. 2019లో డేవిడ్‌ మాల్పాస్‌ను అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నియమించారు. పేద, అభివృద్ధి చెందే దేశాలకు ఆర్థిక సాయం అందించడంలో డేవిడ్‌ మాల్పాస్‌ కీలక పాత్ర పోషించారు. కోవిడ్‌ మహమ్మారి, ఉక్రెయిన్‌`రష్యా యుద్ధం, ప్రపంచ ఆర్థిక మందగమనం వంటి క్లిష్టపరిస్థితుల్లో ఆయన ప్రపంచ బ్యాంకు పగ్గాలను సమర్థంగా చేపట్టారు. విపత్తు సమయాల్లో సత్వరమే స్పందించినట్లు ప్రపంచ బ్యాంకు ఒక ప్రకటనలో పేర్కొంది. మహమ్మారి వేళ రికార్డు స్థాయిలో 440 బిలియన్‌ డాలర్లు అందించినట్లు వెల్లడిరచింది. మాల్సాస్‌ నాయకత్వంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు వాతావరణ ఆర్థిక సాయం రెట్టింపు అయింది. గతేడాది 32 బిలియన్‌ డాలర్లకు చేరింది. కాగా, ప్రపంచ బ్యాంకు అధ్యక్ష బాధ్యతలు చేపట్టక ముందు మాల్పాస్‌ అమెరికా కోశాధికారిగా పనిచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img