Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

దక్షిణాఫ్రికా కమ్యూనిస్టు నాయకుడు
క్రిస్‌ మత్లాకోకు ఘన నివాళి

జోహాన్స్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా కమ్యూనిస్ట్‌ పార్టీ (ఎస్‌ఏసీపీ) నాయకుడు, ఉద్యమకారుడు క్రిస్‌ మత్లాకో ఏప్రిల్‌ 20న మృతిచెందారు. ఆయన మృతికి ఎస్‌ఏసీపీ ఘన నివాళి అర్పించింది. దేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి ఉన్నతమైన సేవలందిం చిన మత్లాకోకి 15వ జాతీయ కాంగ్రెస్‌ సెంట్రల్‌ కమిటీ తన ప్రగాఢ సంతాప సందేశాన్ని తెలియ జేసింది. మత్లాకో తన తుది శ్వాస విడిచే వరకు ప్రపంచవ్యాప్తంగా శ్రామిక-వర్గం తరఫున ఎన్నో పోరాటాలు చేశారు. 13-16 జూలై 2022లో జరిగిన ఎస్‌ఏసీపీ 15వ జాతీయ కాంగ్రెస్‌లో సెంట్రల్‌ కమిటీ మెంబర్‌గా క్రిస్‌ మత్లాకో ఎన్నిక య్యారు.. ఆయన పార్టీలో అంతర్జాతీయ సంబం ధాల కార్యదర్శిగా పనిచేశాడు. 2017లో 14వ జాతీయ కాంగ్రెస్‌ ద్వారా ఎన్నుకోబడిన మత్లాకో 2వ డిప్యూటీ జనరల్‌ సెక్రటరీగా పనిచేశారు. ఆ పదవీకాలానికి ముందు కేంద్ర కమిటీ సభ్యునిగా పనిచేశారు. ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ సభ్యుడు, కార్యకర్త, నాయకుడిగా మత్లాకో సామూహిక ప్రజాస్వామ్య ఉద్యమంలో పనిచేశారు. విద్యార్థిగా మత్లాకో దక్షిణాఫ్రికా విముక్తి పోరాటంలో చేరారు, వర్ణవివక్ష వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడేందుకు విద్యార్థి ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. తరు వాత ఎస్‌ఏసీపీలో చేరారు. సామ్యవాద సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న తెలివైన మేధావి, క్రిస్‌ విప్లవానికి సంబంధించిన అనేక విషయాలపై స్థానిక, అంతర్జాతీయ అంశాలపై వివిధ ప్రచురణల కోసం అనేక వ్యాసాలను రాశారు. సంవత్సరాలుగా వివిధ ప్రచురణలలో ప్రచురించబడిన ఆయన వ్యాసాల సంకలనం థింకింగ్‌ చే అనే పత్రికలో సీరియల్‌గా ప్రచురించడమైంది. దక్షిణాఫ్రికా శ్రామిక-వర్గానికి సేవ చేయడానికి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, పెట్టుబడీదారీ వ్యవస్థను నిరసిస్తూ మత్లాకో అంత ర్జాతీయంగా పోరాటం చేశారు. అంతర్జాతీయవాద పనిలో భాగంగా, కామ్రేడ్‌ క్రిస్‌ ఫ్రెండ్స్‌ ఆఫ్‌ క్యూబా సొసైటీ – సౌత్‌ ఆఫ్రికా జనరల్‌ సెక్రటరీగా పనిచేశాడు. అనేక ఇతర బాధ్యతలతో పాటు సౌత్‌ ఆఫ్రికా పీస్‌ ఇనిషియేటివ్‌లో సభ్యుడు కూడా.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img