Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

దీటైన బదులిస్తాం

ద.కొరియా, అమెరికాకు ఉ.కొరియా హెచ్చరిక
ప్యాంగ్యాంగ్‌: దక్షిణ కొరియా, అమెరికా సంయుక్తంగా వార్షిక సైనిక విన్యాసాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్న క్రమంలో దీటైన బదులిస్తామని ఉత్తర కొరియా శుక్రవారం హెచ్చరికలు చేసింది. వచ్చే వారంలో సంయుక్త టేబుల్‌ టాప్‌ విన్యాసాలు జరపనున్నట్లు దక్షిణ కొరియా ప్రకటించిన నేపథ్యంలో ఉత్తర కొరియా స్పందించింది. ‘దక్షణ కొరియా, అమెరికా సంయుక్తంగా సైనిక విన్యాశాలను నిర్వహిస్తే దానిని తమ దేశంపై యుద్ధానికి కసరత్తుగానే పరిగణిస్తాం. అందుకు తీవ్రమైన పర్యవసానాలను ఎదుర్కోక తప్పదు. ఆ దేశాలకు దీటైన బదులిస్తాం’ అని ఉత్తర కొరియా విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో హెచ్చరించింది. ప్రాదేశిక శాంతి, సుస్థిరతకు ఉద్దేశపూర్వకంగా భంగం కలిగించాలని చూసే నేరగాళ్లు దక్షిణ కొరియా, అమెరికా అని వ్యాఖ్యానించింది. ఈనెల 22 నుంచి వాషింగ్టన్‌లోని పెంటగాన్‌లో డిటరెన్స్‌ స్ట్రాటజీ కమిటీ టేబుల్‌టాప్‌ ఎక్సర్‌సైజ్‌ పేరిట దక్షిణ కొరియా, అమెరికా సైనిక విన్యాసాలు జరగనున్నాయి. ఉత్తర కొరియా నుంచి పెరుగుతున్న అణు ముప్పును తిప్పికొట్టే ప్రయత్నంగానే సంయుక్త సైనిక విన్యాశాలను ఈ రెండు చేశాలు చేపట్టనున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img