Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

దీన దేశం జింబాబ్వే

సంతోషకర దేశంగా స్విట్జర్లాండ్‌
ప్రపంచ దయనీయ దేశాల సూచీ విడుదల
ర్యాంకులిచ్చిన ప్రముఖ ఆర్థికవేత్త స్టీవ్‌ హాంకే

న్యూయార్క్‌ : ప్రపంచంలోనే దీన దేశంగా ఆఫ్రికా దేశమైన జింబాబ్వే నిలిచింది. ఇందుకు అక్కడి అర్థిక పరిస్థితులే కారణం. ఈ మేరకు వార్షిక దయనీయ దేశాల జాబితాను ప్రముఖ ఆర్థికవేత్త స్టీవ్‌ హాంకె రూపొందించారు. ఈ జాబితాలో దయనీయమైన దేశంగా జింబాబ్వేను హాంకే ప్రకటించారు. జాన్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ అప్లయిడ్‌ ఎకనమిక్స్‌ విభాగం ప్రొఫెసర్‌ అయిన స్టీవ్‌ హాంకే ప్రపంచ దేశాల్లోని ఆర్థిక స్థితిగతులు, ఉపాధి అవకాశాలు, బ్యాంకు రుణాలు, ప్రజల జీవన ప్రమాణాలను పరిగణనలోకి తీసుకొని ర్యాంకులు ఇచ్చారు. యుద్ధంలో చిక్కుకొని ఉన్న ఉక్రెయిన్‌, అంతర్యుద్ద్ధంతో అట్టుడుకుతున్న సిరియా, సూడాన్‌ దేశాల కంటే జింబాబ్వే పరిస్థితి దీనంగా ఉన్నట్లు హాంకే వెల్లడిరచారు. గతేడాది జింబాబ్వేలో ద్రవ్యోల్బణం 243.8 శాతానికి చేరడంతో పాటు అధిక నిరుద్యోగం, అధిక రుణ రేట్లు, జీడీపీ వృద్ధి రేటు బలహీనంగా ఉండటం వంటివి ఇందుకు కారణమని పేర్కొన్నారు. అధికార జును-పీఎఫ్‌ విధానాలు కూడా జింబాబ్బేను దయనీయం దేశంగా మార్చాయని స్టీవ్‌ హాంకే తెలిపారు. మొత్తం 157 దేశాలపై అధ్యయనం అనంతరం ప్రపంచంలోని దయనీయ దేశాల జాబితాను రూపొందించారు. ఇందులో టాప్‌ 15లో జింబాబ్వే తర్వాత స్థానాల్లో వెనిజులా, సిరియా, లెబనాన్‌, సూడాన్‌, అర్జెంటైనా, యమెన్‌, ఉక్రెయిన్‌, క్యూబా, టర్కీ, శ్రీలంక, హైతి, అంగోలా, టోంగా, ఘనా ఉన్నాయి. కాగా, స్విట్జర్లాండ్‌ చిట్టచివరిలో ఉంది. స్విట్జర్లాండ్‌ జీడీపీలో రుణభారం చాలా తక్కువగా ఉండటంతో ఆ దేశ ప్రజలు ఆనందంగా ఉన్నట్లు హాంకే వెల్లడిరచారు. సంతోకర దేశాల్లో కువైట్‌, ఐర్లాండ్‌, జపాన్‌, మలేసియా, తైవాన్‌, నైగర్‌, థాయిలాండ్‌, టోగో, మాల్టా ఉన్నాయి. ఆమెరికాకు నిరుద్యోగం వల్ల 134వ స్థానమిచ్చారు. కాగా, సంతోషకర దేశంగా ఉండే ఫిన్లాండ్‌ ఈ జాబితాలో 109వ స్థానంలో ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img