Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

దౌత్యరంగంలో నూతన అధ్యాయం : బైడెన్‌

న్యూయార్క్‌ : అఫ్గాన్‌లో అమెరికా రెండు దశాబ్దాల పోరుకు ముగింపుపలికి దౌత్యరంగంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నట్లు బైడెన్‌ పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి 76వ వార్షికోత్సవ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ న్యూయార్క్‌లో మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యానించారు. దౌత్య రంగంలో అమెరికా నూతన శకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఆందోళనలు ఆయుధాల ద్వారా సమస్యలు పరిష్కరించబడవు. బాంబులు, బుల్లెట్టు కోవిడ్‌19 మహామ్మారి నుంచి రక్షించలేవని బైడెన్‌ పేర్కొన్నారు. సైన్స్‌, రాజకీయ సంకల్పంతో కూడిన సమిష్టి చర్య అవసరమని తెలిపారు. శాంతియుత పరిష్కారాలను అనుసరించే ఏదేశంతోనైనా కలిసి పనిచేయడానికి అమెరికా సిద్దంగాఉందన్నారు. కోవిడ్‌19, వాతావరణమార్పు, అణు విస్తరణ వంటి అంశాలలో సభ్యదేశాలు కలిసి రాకపోతే మనమందరం వైఫల్య పరిణామాలను అనుభవిస్తాం. ఇరాన్‌ అణు ఒప్పందానికి పరస్పరం తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు బైడెన్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కొరియాలో పూర్తి స్థాయిలో అణ్వాయుధీకరణ కొనసాగింపుకు అమెరికా దౌత్యం కోరుకుంటోంది. ఐరాస జనరల్‌ అసెంబ్లీలో బైడన్‌ అరంగ్రేటం, అఫ్గాన్‌ నుండి అస్తవ్యస్తంగా ఉపసంహరిచుకోవదం, ఆస్ట్రేలియాతో జలాంతర్గామి ఒప్పందం, ఫ్రాన్స్‌తో దౌత్యపరమైన విభేదాలతో సహా మిత్ర దేశాలతో తగిన సంప్రదింపులు లేకుండా వివాదాస్పద విదేశీ విధాన నిర్ణయాలను బైడెన్‌ ప్రస్తావించారు. ఔకస్‌ అనే నూతన ఒడంబడికతో అణుశక్తితో నడిచే జలాంతర్గాములను ఆస్ట్రేలియాకు బ్రిటన్‌, అమెరికాలు అందచేయనున్నాయి. బ్రిటీష్‌ టెక్నాలజీతో 12 డీజిల్‌ ఎలక్ట్రిక్‌ జలాంతర్గాముల కొనుగోలుకు గాను 2016లో ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తామని ఆస్ట్రేలియా ప్రకటించింది. నోటీసులేకుండా అకస్మాత్తుగా ఒప్పందాన్ని రద్దు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఫ్రాన్స్‌ శుక్రవారం సంప్రదింపుల కోసం ఆమెరికా, ఆస్ట్రేలియాలోని తన రాయబారులను రీకాల్‌ చేసింది. ఇతర దేశాలతో తమకు తీవ్రమైన భిన్నాభిప్రాయాలు ఉన్పప్పటికీ భాగస్వామ్య సవాళ్లకు శాంతియుత పరిష్కారాలను అనుసరించే ఏ దేశంతోనైనాకలిసి పనిచేయడానికి అమెరికా సిద్దంగా ఉందని బైడెన్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img